Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
తులసి వివాహం: ఈరోజు ఈ చిన్న పూజ చేస్తే చాలు.. మీకు ఎలాంటి కోరిక ఉన్నా అది నెరవేతుంది!
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి. దేవుత్తానా ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తుంటారు. హిందూ సంప్రదాయంలో ఈ ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి నాలుగు నెలల యోగ నిద్ర తరువాత ఈరోజు నిద్ర మేల్కొంటాడని ఈరోజు ఎలాంటి కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని చెబుతుంటారు.
ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి కోటకు పూజలు చేయడం, వాటికి వివాహం చేయడం వంటివి చేయడం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటుంటారు. అయితే ఈ తులసి పూజ ఏ విధంగా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈరోజు తులసి పూజ ఎందుకు చేయాలి?
కార్తీకమాసానికి ముందు సుమారు నాలుగు నెలల పాటు శ్రీమహా విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. నాలుగు నెలల తరువాత నిద్రలేచిన విష్ణువుకి సాధారణంగానే పూజలు చేస్తుంటారు. అయితే పూజలు చేసేటప్పుడు తులసి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే తులసిలో శ్రీమహాలక్ష్మి దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే తులసిని పూజ చేయడంతో పాటు విష్ణువు పూజలో తులసి ఆకులు ఉంచితే చాలా శుభప్రదమని చెబుతుంటారు.
ఈరోజున ఈ తులసిని వివాహం జరిపించడం, పూజించడం చేయడం వల్ల అనేక శుభపరిణామాలు జరుగుతాయి. ఇలా చేయడం వల్ల పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే సంతానం కోరుకుంటున్న దంపతుల కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలిగిపోయి భాగస్వామ్యులిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అందుకే ఎంతో ప్రత్యేకమైన ఈరోజున తులసి కళ్యాణం జరిపితే అమోఘమైన ఫలితాలను పొందొచ్చు.
తులసి కళ్యాణం ఎలా జరిపించాలి?
ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజున శ్రీమహావిష్ణు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ పూజలో భాగంగా తులసి కళ్యాణం కూడా చేస్తారు. ఈ కళ్యాణం చేయడానికి ముందుగా తులసి కోటను శుభ్రం చేసుకోవాలి. అలాగే కళ్యాణం చేయడానికి కావాల్సిన ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ఆసనంపై తులసిని ప్రతిష్టించాలి. దాన్ని పక్కనే సాలిగ్రామాన్ని కూడా ప్రతిష్టించాలి.
ఇప్పుడు ఆ రెండు ఆసనాలు చెరుకు గడలను కట్టి ఉంచాలి. అలాగే ఒక కలశం సిద్ధం చేసి అందులో నీటితో నింపాలి. దానికి 5 లేదా 7 మట్టిది ఆకులతో తోరణం కూడా కట్టాలి. అలాగే తులసి కోట ముందు కళ్ళాపి చల్లి, రంగోలి వేయాలి. మీకు అందుబాటులో ఉంటే ఒక జామ మొక్కను లేదా జామ కొమ్మను తులసి పక్కన ఉంచాలి. అలాగే తులసికి ఎర్రని చునారీ, కంకణం, బిందె మొదలైన వస్తువులతో అలంకరించాలి.
తరువాత ఆ తులసి ముందు నెయ్యితో దీపం వెలిగించి, ఆ కలశాన్ని చేతుల్లోకి తీసుకొని కోట చుట్టూ ఏడూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత హారతి వెలిగించి లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం పొందాలి. అలాగే తులసి పక్కన ఉంచిన జామ మొక్కను రెండు రోజుల తరువాత నాటుకోవడంతో పాటు.. జామకాయను రెండు రోజుల తరువాత నూనెలో దంచి తలకు రాసుకుంటే మంచి జరుగుతుంది. ఈ విధానం తులసి వివాహం జరుగుతుంది.
తులసి వివాహం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎవరైతే తులసిని వివాహం చేసుకుంటారో వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లోని పిల్లలకు పెళ్లి కాకపోతే వారికి త్వరలో వివాహం జరుగుతుంది. తులసికి వివాహం ద్వారా మోక్షం లభిస్తుంది. ఈ పూజ చేసేటప్పుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది.
తులసి పెళ్లిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు?
పెళ్లి రోజున తులసిని ఉపవాసం ఉండి పూజించాలి. ఈ రోజున తులసికి అలంకార వస్తువును సమర్పించాలి. తులసికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. పెద్దలను బాధించవద్దు
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications