కన్యా రాశివారికిపై నాగ దోశం.. శివుడికి ఈ అభిషేకం చేస్తే మొత్తం తొలగిపోతుంది..!!

కన్య రాశివారికి ఊహించని రూపంలో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం కన్య రాశి వారి జీవితాన్నే మార్చేస్తోంది. వీరికి ఉన్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే కన్యరాశి వారు చెయ్యవలసిన అభిషేకం ఏమిటి? ఈ అభిషేకం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు. అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలు గురించి తెలుసుకుందాం.

Snake curse on Virgo zodiac sign

ఈ రాశి వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించని పనులను కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరి కుటుంబం పట్ల జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి. నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వారికి నాయకత్వం వహించడమంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు.

అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో ఈ భూమండలంపై వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక ప్రాధాన్యత ఉంది. అయితే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏవిధంగా అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. కష్టాలనుండి బాధలనుండి దోషాల నుండి విముక్తి పొందాలంటే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి ? అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం.

తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయడం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరశ్వరుడికి శత రుద్రాభిషేకం చేస్తారు. ఈ శత రుద్రాభిషేకం వల్ల కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోణార్క్ లోని సూర్యరూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీని వల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే చంద్ర నాగలింగానికి మహా రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఖాట్మండూ వద్ద త్రినాధ క్షేత్రంలో అతి రుద్ర అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అక్కడ పుణ్యమూర్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఆయువు ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి, నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది.

ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కళశాలతో అద్భుతంగా శివునికి అభిషేకం నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కళాశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూతినిరాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు, అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పని 196 కళాశాలతో లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహించలేరు.

ఈ రాశి వారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయడం వల్ల వారికున్నటువంటి కష్టాలు, దోషాలు, శాపం నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశివారికి అభిషేకం చేయడం చాలా సులభం. ఎందుకంటే అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం భక్తి, శ్రద్ధలు మాత్రమే అభిషేకానికి అవసరం కాబట్టి ఇటువంటి అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించాల్సిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకుని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్ట మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినట్టువంటి శివ లింగానికి చందనం, సుగంధద్రవ్యాలు కస్తూరి అలాగే గంగాజలం పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతి రోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజూ బిల్వ దళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది.

వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకొని ఓం నమశివాయ ఓం నమశివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికున్నటు వంటి అనారోగ్య సమస్యలని కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య బీజ్ మంత్రాన్ని ప్రతి నిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు ఆహారం అందివ్వాలి. నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహారపదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవడం శుభ ఫలితాన్నిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, July 27, 2024, 13:56 [IST]
Desktop Bottom Promotion