Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
సూర్య, బుధుల కలయిక.. ఈ మూడు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం
గ్రహాల రాశి మార్పులే కాదు, గ్రహాల కలయిక కూడా జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. ఈ గ్రహాల కలయిక రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తాయి. జనవరి 14, 2025న, సూర్యుడు మకరరాశిలోకి, జనవరి 24న, బుధుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సుమారు ఒక సంవత్సరం తరువాత ఈ రెండు గ్రహాలు శక్తివంతమైన మకర రాశిలో కలుస్తున్నారు. ఈ రెండు గ్రహాల శక్తి ఏకమై పలు రాశుల వారికి స్వర్ణ కాలాన్ని కలిగించనుంది. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
సూర్యుడు మరియు బుధుల కలయిక మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఈ గ్రహాల సంయోగం మేష రాశి వారి సంపద స్థానంలో జరిగింది. దీని కారణంగా, వారు తమ కార్యాలయంలో మరియు వృత్తిలో పురోగతిని చూస్తారు. అలాగే ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో మారే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు కూడా భారీగా పెరుగుతుంది. దీంతో ఆదాయం కూడా చేతినిండా ఉంటుంది.

ఈ కాలంలో వారి కృషికి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల కొత్త బాధ్యతలు, పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులు వివిధ ఒప్పందాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారు తమ అదృష్ట స్థానంలో సూర్యుడు, బుధుడు కలుస్తున్నారు. ఈ కలయిక వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం వారికి అదృష్టాన్ని, జీవితంలో విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో ఈ రాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తిచేస్తారు.
ఉద్యోగం మారాలని ప్రయత్నించే వారికి కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతులు లభిస్తాయి. వారి కృషి వల్ల ఈ రాశి వారు కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుండి లాభపడతారు మరియు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలం ఉద్యోగార్థులకు మంచి అవకాశాలను అందిస్తుంది.
మకర రాశి
మకరరాశి వారికి సూర్య, బుధ గ్రహాల కలయిక అద్భుత ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ సంయోగం ఈ రాశి వారికి లగ్న స్థానంలో ఏర్పడుతుంది. ఈ కాలంలో వారి వర్కింగ్ స్టైల్ మెరుగుపడుతుంది. అలాగే వారి ప్రయత్నాలు కార్యాలయంలో మంచి ఫలితాలను ఇస్తాయి. పనిలో ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే వారి ప్రయత్నాలకు పై అధికారులచే గుర్తింపు లభిస్తుంది. వారు కుటుంబ అవసరాలను తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ జీవితంలో సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతారణం నెలకొంటుంది.
అలాగే వైవాహిక వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. అవివాహితులకు తగిన వరాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు, ప్రేమ లభిస్తుంది. అలాగే ఈ కాలంలో ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
