Latest Updates
-
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
చాలామంది వాస్తు శాస్త్రం అంటే దిక్కుల గురించి మాత్రమే తెలియజేస్తది,ఇళ్లు లేదా కట్టడాలు నిర్మించేటప్పుడు మాత్రమే వాస్తు చూస్తారు అనుకుంటారు. అయితే వాస్తవంలో మన జీవితంలో ప్రతిదీ వాస్తుతో ముడిపడి ఉండదని వాస్తు నిపుణులు తెలియజేస్తారు. మన ఇంట్లో ప్రతిరోజూ చేసుకునే శుభ్రతకు, వాస్తుకు చాలా దగ్గరి సంబంధం ఉంది.
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఇల్లు తుడవడానికి లేదా మాప్ చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉందని మీకు తెలుసా? ఇష్టమొచ్చిన సమయంలో ఇల్లు తుడిస్తే కష్టాలు తప్పవని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో ఇల్లు తుడుచుకుంటేనే ఇంట్లో సిరిసంపదలు, కుటుంబ సభ్యుల ఎదుగుదల ఉంటుంది. మరి ఏ సమయంలో ఇల్లు తుడవాలో, ఏ సమయంలో తుడవకూడదో ఇక్కడ చూడండి.

ఇల్లు తుడుచుకోవడానికి అనువైన సమయం
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి అత్యంత అనువైన సమయం ఉదయం పూట. సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఉదయం 12 గంటల లోపే ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలంట. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఇల్లు తుడుచుకోవడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శుభ్రం చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.
ఈ సమయంలో పొరపాటున కూడా తుడవకండి
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇల్లు తుడుచుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీకటాక్షం తగ్గిపోయి, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అలాగే సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి పూట ఇల్లు తుడవడం, చీపురుతో ఊడవడం అస్సలు చేయకూడదు. సాయంత్రం వేళ సాక్షాత్తూ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఇల్లు శుభ్రం చేస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ దెబ్బతింటుంది, లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించిన వారవుతారు.
గురువారం ఇల్లు తుడవకూడదా?
అన్ని రోజుల్లోనూ ఇల్లు తుడిచినా, కొన్ని మతపరమైన విశ్వాసాల ప్రకారం గురువారం మాత్రం ఇల్లు తుడుచుకోకూడదు. గురువారం బృహస్పతి (గురు గ్రహం)కి సంబంధించిన రోజు. ఈ గ్రహం సుఖసంతోషాలకు, శ్రేయస్సుకు, అదృష్టానికి ప్రతీక. కాబట్టి గురువారం నాడు ఇల్లు తుడిస్తే ఇంట్లోని సుఖసంతోషాలపై చెడు ప్రభావం పడుతుంది. గురువారం మినహా మిగతా ఏ రోజైనా ఇంటిని మాప్ చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
