Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచం మీద కూర్చొని తింటున్నారా? వాస్తు శాస్త్రం చెబుతున్న భయంకరమైన నిజాలు!
తమ ఇళ్లల్లో మంచం మీద కూర్చొని అన్నం తినడం లేదా ఇతర ఆహారాలు తినడం చాలామందికి ఉండే అలవాటే. ఎవరైనా పెద్దవారు వచ్చి మంచం మీద కూర్చొని తినకూడదు అంటే ఏ పో అంటూ కసురుకుంటుంటారు. హాయిగా ఫోన్ వాడుతూ లేదా టీవీ చూస్తూ మంచం మీద కూర్చొని తినడం అలవాటుగా మారిపోయింది.
అయితే మంచం మద కూర్చొని తినడం కంఫర్ట్ గా అనిపించినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మోస్ట్ డేంజరస్ అలవాటు. అన్నంని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే మన పెద్దలు భోజనానికి అంతటి పవిత్రతను ఇచ్చారు. మరి మంచం మీద తినడం వల్ల ఏమవుతుంది? భోజనం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి?

మంచం మీద తినడం వల్ల ఏమవుతుంది
-వాస్తు శాస్త్రం ప్రకారం మంచం అనేది నిద్రకు, విశ్రాంతికి సంబంధించిన ప్రదేశం. అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అన్నాన్ని అగౌరవపరచినట్లవుతుంది. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తడమే కాకుండా, పేదరికం, దారిద్ర్యం వచ్చే అవకాశం ఉంది.
-మంచం మీద తినేటప్పుడు ఆహారపు మెతుకులు పడటం సహజం. ఇలా పడకగదిలో ఆహారం చిందించడం వల్ల రాహువు ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. జాతకంలో రాహు దోషం ఉంటే జీవితంలో ఊహించని అడ్డంకులు, మానసిక ఒత్తిడి, భయాలు కలుగుతాయి.
-మంచం విశ్రాంతి స్థలం.. అక్కడ భోజనం చేయడం వల్ల ఆ ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. నిద్రలేమి సమస్యలు రావడమే కాకుండా, పీడకలలు రావడం, మనసులో అశాంతి కలగడం వంటివి జరుగుతాయి.
-ఈ అలవాటు కేవలం ఇంటికే కాదు, వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం, ఉద్యోగంలో చికాకులు, విజయానికి దూరమవ్వడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనం చేయడానికి సరైన దిశ ఏది?
-వాస్తు ప్రకారం మనం కూర్చునే దిశ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తూర్పు..భోజనం చేయడానికి ఇది అత్యుత్తమమైన దిశ. తూర్పు వైపు ముఖం చేసి తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
-కెరీర్ పరంగా విజయం సాధించాలనుకునేవారు, విద్యార్థులు, ఆర్థిక లాభం కోరుకునే వ్యాపారస్తులు ఉత్తరం వైపు ముఖం చేసి భోజనం చేయడం చాలా మంచిది. ఇది జ్ఞానాన్ని,సంపదను ఇస్తుంది.
సరైన భోజన పద్ధతి
-నేల మీద బాసిపట్టు వేసుకుని (సుఖాసనంలో) కూర్చుని తినడం వల్ల పొట్ట దగ్గరి కండరాలు ఉత్తేజితమై జీర్ణక్రియ అద్భుతంగా జరుగుతుంది. ఇది భూమి నుండి పాజిటివ్ ఎనర్జీని గ్రహించడానికి సహాయపడుతుంది.
-భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, నోరు కడుక్కోవడం భారతీయ సంప్రదాయం. ఇది శరీరాన్ని చల్లబరిచి, భోజనానికి సిద్ధం చేస్తుంది.
-ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ మీద తింటున్నా సరే మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. దక్షిణ దిశ వైపు ముఖం చేసి ఎప్పుడూ తినకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications