Latest Updates
-
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు
2025లో ఈ రాశులకు చెందిన వారు గెలుపు గుర్రాలు అవుతారు!
ఇంకా కొన్ని రోజుల్లో 2025వ సంవత్సరం వచ్చేస్తుంది. 2025కి సంబంధించిన జాతకాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే పాఠకులు 2025లో తమ జాతకం ఎలా ఉండబోతుంది, తాము ఏ విధమైన జీవితాన్ని గడపనున్నాము అనేది తెలుసుకుంటున్నారు. కొన్ని రాశుల వారికి 2025 సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంటే, ఇంకా కొంత మందికి దారుణమైన ఫలితాలు రానున్నాయి. కొన్ని రాశుల వారు మాత్రం తమ జీవితంలో శిఖరాగ్రానికి చేరుకోబోతున్నారు. ఈ స్టోరీలో 2025లో ఏ రాశుల వారు గెలుపు గుర్రాలు కాబోతున్నారో తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశి వారికి 2025 సంవత్సరం ప్రారంభం శని సంచారం మొదలవుతుంది. ఈ సంచారం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను అందించనుంది. దీని కారణంగా ఈ రాశి వారి ఆర్తిగా పరిస్థితి మెరుగవుతుంది. తెలివైన ఎంపికలు చేసుకోవడానికి ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. తెలివైన ప్రణాళికలతో ఈ రాశి వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు.

ఈ రాశి వారు తమకు కావాల్సిన దానికి కోసం ముందుగానే ప్రణాళిక రచించుకోవాలి. తమకు కావాల్సిన దానికోసం ఏం చేయాలి? ఏ విధమైన పనులు చేయాలి అనేది ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకొని దానికనుగుణంగా పని చేస్తే గెలుపు గుర్రం అవుతారు. ఈ రాశుల వ్యక్తుల జీవితంలో కొత్త వ్యక్తులు వస్తారు. వీరు ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధించేందుకు సహాయం చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి కొడితే ఈ సంవత్సరం మీ విజయానికి బావుట ఎగరేస్తుంది.
మిధున రాశి
బుధుని అనుగ్రహం వల్ల 2025 ప్రారంభంలో ఈ రాశి వారి జీవితంలో లగ్నం ప్రారంభమవుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందేందుకు ఈ రాశి వారికి అన్ని గ్రహాలూ అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు గొప్ప విజయాలను సాధిస్తారు. భారీగా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నతమైన స్థానంలో ఉంటారు.
ఫిబ్రవరిలో శని మరియు బుధుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటారు. మీ పనిలో ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి మీరు మరింత సానుకూలంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు, ఈ సమయంలో గ్రహాలు సహకరిస్తాయి. మొత్తం మీద 2025 ఈ రాశి వారికి ఒక గొప్ప సంవత్సరంగా మారబోతుంది. ఈ రాశి వారిని గెలుపు గుర్రాలుగా మార్చేయనుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఇది విజయవంతమైన సంవత్సరం. ఫిబ్రవరిలో గురు భగవాన్ ఈ రాశి వారికి వారి జీవితాన్ని మెరుగుపరుచుకుని అవకాశాలు ఇస్తారు. ఇది పనిలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. శుక్రుడు మార్చిలో కొన్ని గొప్ప అవకాశాలను అందిస్తాడు.. దీని కారణంగా వ్యాపారంలో గొప్ప విజయాలు మీకు దాసోహం అంటాయి. అలాగే మీరు మీ వ్యాపారంలో గొప్ప గొప్ప ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు.
ఏప్రిల్‌లో పనిలో కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఇది కొంత కఠినమైన సమయం కావచ్చు. కానీ కొన్ని తెలివైన నిర్ణయాలు, శుక్రుడి ఆశీస్సులతో ఈ కాలంలో కూడా మంచి లాభాలను సాధించవచ్చు. ఆగస్టు తరువాత వీరి జీవితం టాప్ గేర్‌లో దూసుకెళ్లిపోతుంది. వ్యాపారం దూసుకెళ్లిపోతుంది. దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. చేతులు రెండు ధనంతో నిండిపోతుంది.
మకరరాశి
2025వ సంవత్సరంలో ఈ రాశి వారిపై విజయానికి మరియు సంపదకు కారణమైన శుక్రుడు ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ రాశి వారి ఉత్పాదకత మరియు తెలివితేటలు మెరుగ్గా ఉంటాయి. బుధుడు ఈ రాశి వారిపై వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తాడు. పనిలో, వ్యాపారంలో శ్రద్ధను అందజేస్తాడు. ముఖ్యమైన సమస్యలను దూరం చేస్తాడు.
కార్యాలయంలో విశ్వాసం మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించగలుగుతారు. ఇది వీరి పనిలో గణనీయమైన మెరుగుదలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సమస్యలు కూడా ఈ రాశి వారిని వెంటాడే అవకాశం ఉంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రవర్తించాలి. శుక్రుడి దీవెనలు, గురుడి అదృష్టం కారణంగా ఈ రాశి వారు గెలుపు గుర్రాలు కానున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications