Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
Today’s Horoscope: ఈ రాశివారికి ప్రాణగండం.. ఈ ఒక్కటి పాటిస్తే అంతా శుభమే
నేటి రాశి ఫలాల్లో మేష రాశి వారికి అత్యంత అనుకూలమైన కాలం ఉండనుంది. వారికి ఆర్థికపరంగా లాభాలు ఉండడనున్నాయి. అలాగే పలు ప్రయాణాల్లో లాభాలు చేకూరనున్నాయి. అయితే మిగిలిన రాశుల ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఏ విధమైన ప్రయోజనం కలగనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశివారికి వారి పనితీరుకు సమాజంలో ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన విషయమై పెద్దలను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పని పూర్తవడంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో అమలు చేయాలనుకుంటున్న ప్రణాళికలు అమలు చేయడంతో పాటు ఆ ప్రణాళికలో విజయం సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఎప్పటి నుంచో కలలు కన్న సొంతింటి కల సాకారం అవుతుంది.
మిథున: ఈ రాశి వారికి ఈరోజు కొంచెం గడ్డు కాలమే నడుస్తుందని చెప్పుకోవాలి. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ పట్టుదలతో, లక్ష్యాన్ని సాధించాలనే నిర్ణయంతో ఆ ఆటంకాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను కొన్నిరోజులు వాయిదా వేసుకుంటేనే మంచిది. కొన్ని కార్యక్రమాలు మీలో చాలా బాధను కలుగజేస్తాయి.
కర్కాటకం: ఈ రాశివారికి ఈరోజు ముందుచూపు చాలా అవసరం. ఏ పని చేపట్టినా ముందు చూపుతో వ్యవహరించి, ముందుగానే దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి అధికారుల సహకారం అందుతుంది.
సింహ: ఈ రాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చేపట్టాల్సిన పనుల్లో ముందు జాగ్రత్తగా వ్యవహరించి శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అధికంగా ఖర్చు చేయకుండా పొదుపు సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించి శత్రువులపై విజయం సాధిస్తారు.

కన్య: ఈ రాశివారికి ఈరోజు శుభకాలం గోచరిస్తుంది. ఒక శుభవార్త కన్యరాశి జాతకుల కుటుంబాల్లో సంతోషాలు నింపుతాయి. ఈ రాశి వారికి సమాజంలో ప్రశంసలు దక్కుతాయి. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు.
తుల: ఈ రాశివారికి ముందు చూపు చాలా అవసరం. ఈ రాశి వారు చేపట్టే పనుల్లో అనుకూలత కనిపిస్తోంది. ప్రతి పనిలోనూ బంధువుల సహకారం ఉంటుంది. ఇష్టదేవతను పూజిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.
వృశ్చిక: ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సమస్య ఎదురైనా మనో ధైర్యాన్ని మాత్రం వదలొద్దు. వృత్తి, వ్యాపార, వినోద, విందు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శ్రమిస్తేనే ఫలితం పొందే ఛాన్సుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.
ధనుస్సు: ఈ రాశివారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఈ రాశివారు ఈరోజు గడుపుతారు. ఎలాంటి సమస్య ఎదురైనా మనోధైర్యంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. పలు ముఖ్యమైన పనులతో పాటు, ప్రయాణాల్లో అస్సలే అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్త ప్రాణగండంగా మారే అవకాశముంది.
మకరం: ఈ రాశివారు నేడు ముందుచూపుతో వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశివారికి ఈరోజు ఒక శుభవార్త వస్తుంది. ఆ వార్త.. వీరి జీవితంలో సుఖ సంతోషాలను, ఆనందాలను వెల్లివెరిసేలా చేస్తాయి. పట్టుదలతో ఈ రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో తెలివిలేకుండా వ్యవహరించి నవ్వులపాలు అవుతారు.
కుంభం: ఈ రాశి వారికి నేడు ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక కీలకమైన వ్యవహారంలో ముఖ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసంతో పాటు మనో ధైర్యాన్ని పెంచుతుంది.
మీనం: ఈ రాశి వారు.. వారి వారి రంగాల్లో ఓర్పు, పట్టుదల ఉండాలి. బంధువులతో ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు. అవసరానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొదుపు సూత్రాన్ని పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications