Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
ఈ రాశుల వారు "నా దారి రహదారి" అన్నట్టుగా వుంటారు..!
జ్యోతిష్యంలో వున్న 12 రాశుల్లో ఒక్కోరాశిది ఒక్కో వ్యక్తిత్వం వుంటుంది. ఇలా 12 రకాల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు వుంటాయ్. ఇవి పుట్టుకతో వస్తాయ్. వీటిని మనము అస్సలూ మార్చలేము. కొన్ని రాశులు కోటిమందిలో పోటుగాడిలా వుండాలని కోరుకుంటారు. 100 మందిలో ఒకరిగా ప్రత్యేకంగా వుండాలనే భావన వీరికి వుంటుంది. అలాంటి మనస్తత్వం కలిగి వున్న రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి
కన్యా రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు. చిన్ని వయసులోనే చాలా విషయాలను నేర్చుకుంటారు. అన్నింటినీ బాగా గమనిస్తూ వుంటారు. వీరిది దృఢమైన మనసు. ఎన్ని కష్టాలు వచ్చినా తొనకకుండా నిలబడి వుంటారు. కష్టసమయంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటారు. సొంత అభిప్రాయం కలిగిన వ్యక్తిత్వం వుంటుంది. వీరు అన్నింటా పర్ఫెక్షన్ సాధించాలని చాలా కష్టపడతారు. వీరికి అప్పజెప్పిన పనిని 100 శాతం పూర్తి చేస్తారు.
తులా రాశి
తులా రాశికి చెందని వారు మల్టీటాస్కింగ్ చేయడంలో దిట్ట. ఏపని అయినా సకాలంలో పూర్తి చేయాలనే మనస్తత్వాన్ని కలిగి వుంటారు. ఆ పని పూర్తి చేయడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. వీరు అన్ని విషయాలను చాలా సింపుల్‌గా వుంచాలని కోరుకుంటారు. ఆర్భాటాలకు ఎక్కువగా పోరు. వారు చేసే ప్రతీ పనిని అత్యంత చిత్త శుద్ధితో చేస్తారు. ఎవరూ తమను వేలెత్తి చూపించని స్థాయికి ఎదగాలనే కోరికను కలిగి వుంటారు. తమని తాము ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోరు. దీని వల్ల వీరు అప్పుడప్పుడూ ఒత్తిడికి కూడా లోనవుతారు.

సింహరాశి
సింహరాశిలో జన్మించిన వారు తమని తాము చాలా అమితంగా ప్రేమిస్తారు. అన్ని విషయాల్లో చాలా ప్రత్యేకంగా వుండాలని కోరుకుంటారు. సొంత అభిప్రాయాలను కలిగి వుంటారు. అందరిలో తామే ప్రత్యేకంగా వుండాలనే కుతూహలాన్ని కలిగివుంటారు. అందుకేవారు ఒక బెస్ట్ పర్సన్ కావాలని బలంగా అనుకుంటారు. కష్టపడే స్వభావం వీరికి చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతీదాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ప్లాన్ చేస్తారు. తాము అనుకున్నది జరగనప్పుడు వీరు చాలా నిరాశకు లోనవుతారు.
మేష రాశి
మేషరాశి వారు తమ జీవితంలో పర్ఫెక్షనిజంను ఎక్కువగా ఇష్టపడతారు. అన్నీ సకాలంలో పూర్తికావాలని అనుకుంటారు. అన్ని టాస్కులను పర్ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటూ తమను తామే ఎక్కువగా విమర్శించుకుంటారు. అనుకున్న పనిని సాధించలేకపోతే తమను తాము తీవ్రంగా తిట్టుకుంటూ వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
