ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.!

ప్రతి మనిషి జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షిస్తారు. అందుకనుగుణంగా తమకు నచ్చిన రంగాల్లో కష్టపడతారు. ఉద్యోగం, వ్యాపారం, వారసత్వం ఇలా ఏదైనా కావచ్చు.. పట్టుదల, శ్రమ, అంకితభావం, ఆధ్యాత్మికత, కుటుంబీకుల మద్దతు ఇలా అన్నిటినీ బలంగా చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని నిర్దిష్ట నెలల్లో జన్మించిన వారు ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ నెలలు ఏంటి.. మీరూ ఆ నెలలోనే జన్మిస్తే మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది.. తెలుసుకుందాం..

Those born in these 5 months have a high chance of becoming wealthy

జనవరి

జనవరిలో జన్మించిన వారు చాలా క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే వీరు రాత్రికి రాత్రే ధనవంతులు కాలేరు. కానీ పనిలో నిబద్ధత, కష్టపడి పనిచేయడం, సాధించాలనే పట్టుదలతో వారు ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. వీరిలో ధనవంతులు కావాలని, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది.

అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?

మార్చి

మార్చిలో పుట్టినవారిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. వారిలో ఆలోచనాత్మక శక్తి, ఊహాలోచనలు బలంగా ఉంటాయి. ఈ సామర్థ్యంతో వారు ధనవంతులు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారం, ఆర్ట్స్‌, మీడియా, టెక్నాలజీ వంటి రంగాల్లో వారు గణనీయమైన లాభాలతో దూసుకుపోయే తెలివితేటలు వీరి సొంతం.

మే

మేలో జన్మించిన వారిలో బలమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సామర్థ్యాలు, తెలివితేటలతో వారు ధనవంతులు అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారం, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో వీరు అడుగుపెట్టినట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండగలరు.

Those born in these 5 months have a high chance of becoming wealthy

ఆగష్టు

వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా!

ఆగష్టులో జన్మించిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించాలని పట్టుదల కలిగి ఉంటారు. రాజకీయాలు, వ్యాపారం, కార్పొరేట్‌ రంగాలు వీరికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఇస్తాయి.

నవంబర్‌

నవంబర్‌లో పుట్టినవారిలో కష్టపడి పనిచేసే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ వ్యూహాత్మక ఆలోచనలతో గణనీయంగా డబ్బు సంపాదిస్తారు. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌, రీసెర్చ్‌ వంటి రంగాల్లో ఆర్థికంగా ఊహకందని లాభాలు అందుకుంటారు. అయితే జ్యోతిష్యంతో పాటు చేస్తున్న పనిలో కఠోర శ్రమ, పట్టుదల, గ్రహాలు అనుకూల స్థానంలో ఉండటం కూడా అవసరమని గమనించాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, September 29, 2026, 15:40 [IST]
Desktop Bottom Promotion