Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు సెనసిటివ్ గ అందరితో ప్రేమగా ఉంటే.. మరికొందరు దానికి పూర్తి భిన్నంగా ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా, నిప్పులాంటి కోపంతో ఉంటారు. వాళ్ల ప్రవర్తన చూస్తే ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఇలాంటి అత్యంత తీవ్రమైన లక్షణాలు ఉంటాయి.
భావోద్వేగాలను దాచుకోవడంలో, అనుకున్నది సాధించడంలో వీరు చూపే తెగింపు చూసి ఫ్రెండ్స్ సరదాగా వీళ్లను సైకో అని ముద్దుగా పిలుస్తుంటారు. వినడానికి ఈ పదం కాస్త కఠినంగా అనిపించినా, వారి వింత ప్రవర్తనకు ఈ పేరు కరెక్ట్‌గా సరిపోతుంది. మరి ఆ డాషింగ్ అండ్ డేరింగ్ రాశులేంటో ఇక్కడ చూడండి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిది అత్యంత తీవ్రమైన, రహస్యమైన స్వభావం. ఎదుటివాళ్ల మనసును ఇట్టే చదివేస్తారు కానీ, తమ మనసులోని మాటను, బలహీనతలను మాత్రం పొరపాటున కూడా బయటపెట్టరు. వీరికి ఒక వస్తువు లేదా లక్ష్యం కావాలనిపిస్తే.. దానిని సాధించే వరకు నిద్రపోరు. అవసరమైతే ఎంత నిర్దాక్షిణ్యంగా మారడానికైనా వెనకాడరు. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో వీరికి వీరే సాటి. వీళ్ళ ఈ సైలెంట్ అండ్ వయలెంట్ ప్రవర్తన చూస్తే ఎవరికైనా వీళ్ళను సైకో అనకుండా ఉండలేరు.
మకర రాశి
మకర రాశి వారు పక్కా ప్రాక్టికల్. వీరికి ఆశయాలు, క్రమశిక్షణే ప్రాణం. వీరు కాస్త ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. తమ భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అందుకే వీరు బయటి ప్రపంచానికి చాలా కఠినాత్ములుగా కనిపిస్తారు. ఏ పని చేసినా భవిష్యత్తు గురించి పక్కాగా లెక్కలు వేసుకుని మరీ చేస్తారు. జీవితంలో విజయం సాధించడానికే వీరు మొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి,వీరి నిబద్ధతను చూసి జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు.

మిథున రాశి
మిథున రాశి వారు మహా తెలివైన వారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము సులభంగా మార్చుకుంటారు. కానీ, వీరిలోని ద్వంద్వ స్వభావం వల్ల ఒకే మాట మీద, ఒకే ఆలోచన మీద స్థిరంగా నిలబడలేరు. సమస్యల నుంచి బయటపడటానికి తమ నిజమైన ఉద్దేశాలను చాలా ఈజీగా దాచేస్తారు. అప్పటికప్పుడు మాటలు మార్చే వీరి తీరు చూసి, చుట్టుపక్కల వారు వీరిని నమ్మదగని వారిగా లేదా కాస్త మెంటల్ అని అనుకుంటారు.
మేష రాశి
మేష రాశి వారు చాలా ధైర్యవంతులు కానీ వీరికి ఓపిక సున్నా. స్నేహితుల మధ్య వీరు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటే ముందు వెనకా ఆలోచించకుండా, పరిణామాల గురించి పట్టించుకోకుండా దూసుకుపోతారు. వీరి ఈ దూకుడు స్వభావాన్ని చూసి చాలామంది వీరికి పిచ్చి లేదా పట్టింపు లేని సైకోలు అని ముద్ర వేస్తారు. కానీ నిజానికి వీరికి దయ లేకపోవడం కాదు, నాయకత్వం వహించాలనే కసి అలాంటిది. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వీరి నిజాయితీని ప్రపంచం కఠినంగా అర్థం చేసుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
