వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా!

చిన్న గుడిసె అయినా లేదా పెద్ద బంగ్లా అయినా సరే ఏ ఇంట్లో అయినా చీపురు ఉండి తీరాల్సిందే. మన ఇంటిని శుభ్రం చేసే చీపురుని మన పెద్దలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకు అని తరుచూ చెబుతుండటం చూస్తుంటాం.

హిందూ ధర్మం, వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు క్షాత్తు సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవికి సజీవ ప్రతిరూపం. వాస్తు ప్రకారం మనం చీపురును ఉపయోగించే విధానం, దాన్ని ఇంట్లో ఉంచే దిశపైనే మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి.

Vastu Tips for Broom Right Direction to Keep Broom at Home for Financial Prosperity

అందరికీ కనిపించేలా పెట్టకండి

చీపురును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా ఇంటికి వచ్చే అతిథులకు లేదా బయటి వ్యక్తులకు నేరుగా కనిపించేలా అస్సలు ఉంచకూడదు. దీనిని ఎల్లప్పుడూ ఇతరుల కంటికి దూరంగా, ఒక మూలన దాచి ఉంచాలి. చీపురు బహిరంగంగా కనిపించడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి, ఆర్థిక వనరులు అడుగంటిపోతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉంచాల్సిన సరైన దిశ ఇదే

చీపురును ఉంచడానికి నైరుతి లేదా పడమర దిశలు అత్యంత శుభప్రదమైనవి. ఈ దిశల్లో దాన్ని ఉంచడం ద్వారా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ దూరమై, కుటుంబంలో సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. పొరపాటున కూడా చీపురును ఈశాన్య దిశలో పెట్టకండి. ఇది తీవ్రమైన ధన నష్టానికి దారితీస్తుంది. అలాగే వంటగది, పడకగది లేదా దేవుని గదిలో చీపురు పెట్టడం మహాపాపం. ముఖ్యంగా వంటగదిలో ఉంచితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే. దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

నిలబెట్టి ఉంచుతున్నారా?

చాలామందికి చీపురును గోడకు ఆనించి నిలబెట్టే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. నిలబెట్టిన చీపురు దరిద్రానికి సంకేతం. ఇది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అనవసర గొడవలకు దారితీస్తుంది. అందుకే చీపురును ఎప్పుడూ నేలమీద పడుకోబెట్టే ఉంచాలి.

సంధ్యా సమయంలో ఊడుస్తున్నారా?

సూర్యాస్తమయం తర్వాత లేదా చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చడం లేదా చెత్తను బయట పారబోయడం అస్సలు చేయకూడదు. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, ఆ సమయంలో ఊడిస్తే ఆమెను ఇంట్లోంచి గెంటేసినట్లేనని మన పెద్దలు చెబుతారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఊడ్చాల్సి వచ్చినా.. ఆ చెత్తను ఇంట్లోనే ఒక మూల కుప్పగా చేసి, మరుసటి రోజు ఉదయం మాత్రమే బయట పారేయాలి.

లక్ష్మీదేవికి అవమానం

చీపురును ఉద్దేశపూర్వకంగా కాలితో తొక్కడం లేదా దాటి వెళ్లడం సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించడమే. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఒకవేళ పొరపాటున చీపురుకు కాలు తగిలినా వెంటనే తలవంచి, నమస్కరించి క్షమాపణ కోరుకోవడం మన సంప్రదాయం.

పాత చీపురు పారేసే సరైన రోజు

ఇంట్లో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత చీపురును అలాగే ఉంచితే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. పాత చీపురును వదిలించుకోవడానికి శనివారం లేదా అమావాస్య రోజులు సరైనవి. సిరిసంపదలకు ప్రతీకలైన గురు, శుక్రవారాల్లో పాత చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పారేయకూడదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, September 28, 2026, 11:56 [IST]
Desktop Bottom Promotion