Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
Today Astrology in Telugu: ఈ రాశుల వారి లవ్ సక్సెస్, వ్యాపారులకు భారీ లాభాలు
జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతిరోజూ గ్రహాల స్థానం, నక్షత్రాల కదలిక మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల జీవితాలను మారుస్తాయి. ఈ మార్పులు కెరీర్, ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం నుండి ప్రతిదానిలోనూ కనిపిస్తాయి. ఈరోజు శుక్రవారం ఫిబ్రవరి 14, 2025న ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో ఇక్కడ చూడండి.
మేషం
ప్రేమికుల దినోత్సవం అయిన ఈ రోజు మేష రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు ఉంటాయి. ఇంట్లో కొన్ని సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. అయితే ఆరోగ్యం ఆందోళనకరంగా మారవచ్చు. వ్యాపారంలో కొన్ని నష్టాలు ఉండవచ్చు. ఖర్చు పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. అనవసర విషయాల్లో జోక్యం వల్ల తగాదాలు వస్తాయి. ఈరోజు మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా మాట్లాడటం ముఖ్యం. మీ తెలివితేటలకు తగ్గ గుర్తింపు వుండదు. ఖర్చు పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఊదా.

వృషభం
మీకు దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. సహచరులు ముఖం చాటేస్తారు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. పనుల్లో అడ్డంకులు ఆందోళన కలిగిస్తాయి. పనిలో మీ ఉన్నతాధికారుల సూచనలను పాటించడం మంచిది. ఆస్తి సంబంధిత చట్టపరమైన విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట రంగు నలుపు.
మిథునం
ఈ రోజు మిథున రాశి వారికి సంతోషకరమైన రోజు అవుతుంది. సాహసోపేతమైన నిర్ణయం మిమ్మల్ని విశిష్టంగా నిలబెడుతుంది. ప్రయాణం లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. రోజంతా సంతోషకరమైన క్షణాలు నిండిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలను చూడవచ్చు. ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించడానికి మీకు అవకాశం ఉంటుంది ఈరోజు మీ అదృష్ట రంగు నీలం.
కర్కాటకం
ఈరోజు ఖర్చులు పెరుగుతాయి..కానీ మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల చిక్కుల్లో పడతారు. పని సంబంధిత విషయాలలో అదనపు కృషి అవసరం కావచ్చు. కుటుంబంలోని పెద్ద సభ్యునితో కొన్ని వాదనలు ఉండవచ్చు. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఎరుపు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు ధన లాభం ఉంది. గౌరవం పెరుగుతుంది. కొత్త స్నేహితులు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. వాహన యోగం ఉంది. బంధువులతో విందుకు హాజరవుతారు. మీ కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త విషయాలు తెలుస్తాయి. పుకార్లను నమ్మడం మానుకోండి. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ.
కన్య రాశి
ఈ రోజు కన్య రాశి వారికి కుటుంబ ఆరోగ్య సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. ర్దేశించుకున్న రీతిలో పనులు సాగవు. సహోద్యోగులతో విభేదాలను ఎదుర్కోవలసి రావచ్చు. పోటీలకు దిగకండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా వుండండి. వ్యాపారవేత్తలు ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందవలసి రావచ్చు. వ్యక్తిగత సంబంధాలు పరీక్షించవచ్చు, ఇది ఇబ్బందులకు దారితీస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు.
తుల రాశి
తుల రాశి వారు ఈ రోజు సంతోషకరమైన రోజును ఆస్వాదించవచ్చు. ప్రణాళికలన్నీ నిజమవుతాయి. కార్య నిర్వహణలో సత్ఫలితాలను పొందుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇది ఆనందం సానుకూల మార్పులను తెస్తుంది. వ్యాపారం స్థిరంగా, లాభదాయకంగా ఉంటుంది. ఇష్టమైన వారి కలయిక ఆనందాన్ని పెంచుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట రంగు గులాబీ.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు అవుతుంది. నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశాలు కలిసివస్తాయి. మీరు ఉద్యోగార్ధులైతే ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడానికి లేదా మీ రెజ్యూమ్‌ను అప్ డేట్ చేసుకోడానికి ఇది గొప్ప రోజు అవుతుంది. మీ వినూత్న ఆలోచనలు, ముందుచూపుతో ఆలోచించే విధానం మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఈ రోజు అదృష్ట రంగు పసుపు.
ధనుస్సు
నగదు ప్రవాహం పెరుగుదల ఆనందాన్ని కలిగించినప్పటికీ మీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో జాప్యం చికాకు పెడుతుంది. దూర ప్రయాణం ఉంది. ఉదర సంబంధ సమస్య వచ్చే అవకాశముంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏదైనా పని ఆలస్యం అయితే, అది ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ అదృష్ట రంగు మెరూన్.
మకర రాశి
మకర రాశి వారు ఈరోజు స్వీయ నియంత్రణ పాటించాలి. అనవసరమైన కోపాన్ని నివారించాలి,మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పదాలను వాడాలి.. లేకుంటే కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా లాభం పొందే అవకాశం ఉంది. పని కోసం చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పోటీల్లో పాల్గొనకండి. ఈరోజు మీ అదృష్ట రంగు ఊదా.
కుంభ రాశి
కుంభ రాశి వారిక, ఈ రోజు అదృష్టవంతమైన రోజు అవుతుంది. చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. సోదరుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అప్పుల్లో కూరుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అంతరాయం కలిగించిన పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఈరోజు మీ అదృష్ట రంగు నారింజ.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ శక్తిని సరైన మార్గాల్లో ఉపయోగిస్తే అది మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీకు ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని చర్చించుకోవడం మంచిది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఈరోజు మీ అదృష్ట రంగు గోధుమ రంగు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications