Latest Updates
-
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా..
ఉగాది పంచాంగం 2023-2024: ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది?లాభమా..నష్టమా?
ఉగాది పంచాంగం 2023-2024: ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది?లాభమా..నష్టమా?

మేషరాశి : అశ్వని 4 పాదం, భరణి 4వ పాదం, క్రుత్తిక 1వ పాదం , ఆదాయం: 5, వ్యయం : 5 రాజ్యపూజ్యం: 3 అవమానం: 1
హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలో ఉగాది పండగను 22 మార్చి 2023 న జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, శుభకృత నామ సంవత్సరం మార్చి 21న ముగుస్తుంది మరియు కొత్త సంవత్సర శోభకృత సంవత్సరం శ్రీ శ్రీ శోభ కృత నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సర శోభకృత సంవత్సరము 8 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. ఈ రోజును కర్ణాటకలో మరియు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఈ పండుగ అతి పెద్ద పండగగా జరుపుకోవడం ఆనవాయితి. పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలోని శుక్ల పక్ష ప్రతిపద తిథి మార్చి 21, 2023 రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి 22, 2023 రాత్రి 8.20 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, ఉగాది 22 మార్చి 2023 వరకు ఉంటుంది.

ఈ సంవత్సరం ఉగాది శ్రీ శోభకృతునామ సంవత్సరంగా తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. . పంచాంగ శ్రవణం ఆ రోజు ప్రత్యేకత. పంచాంగ శ్రవణం అని అర్థం. ఆర్థిక సంవత్సరం సంబంధిత కంపెనీ లేదా సంస్థ ప్రకారం ఒక నెల నుండి మరొక నెలకు నిర్ణయించబడినట్లే, అదే విధంగా ఒక సంవత్సరం ఒక నెల నుండి మరొక సంవత్సరంగా మారుతుంది. జన్మ రాశి ప్రకారం ఏ ఫలితాలు లభిస్తాయి, గోచార ఫలితాలు ఏమి చెబుతున్నాయి. ఆదాయం-వ్యయం, ఆరోగ్యం-అనారోగ్యం, సంతోషం-దుఃఖం మొదలైనవాటిని కూడా ఆలోచించి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అని విభజించి ఆదాయ ఫలితాన్ని కూడా సూచిస్తుంటారు. గోచారంలో ముఖ్యమైన గ్రహాల ఆధారంగా ఈ ఫలితం జ్యోతిష్యశాస్త్రజ్ఝులు తెలియజేస్తుంటారు. ఈ నూతన సంవత్సరంలో మీరు మేషరాశి జాతకాన్ని పరిశీలిస్తే, మీరు మిశ్రమ ఫలితాలను ఆశించవచ్చు.ఈ సంవత్సరంలో మేషరాశి వారి కుటుంబం, వృత్తి, ఆర్థిక మరియు ఆరోగ్య జీవితం గురించిన సమాచారంను ఈ కథనంలో తెలియజేశాము. ఆలస్యం చేయకుండా చదివేయండి.

ఉగాది నుండి మేషరాశిలో గ్రహాలలో మార్పు
ఈ సంవత్సరం మేషరాశికి 1వ ఇంట్లో అంటే లగ్నానికి బృహస్పతి సంచారం ఉంటుంది. శని శుభ స్థానంలో ఉన్నాడు.కుజను 2023 మే 9 నుండి జూన్ 29 వరకు అర్ధాశత నందు ఉన్నాడు. 16 నవంబర్ నుండి 20 డిసెంబర్ 2023 వరకు ఎనిమిదవ ఇంటిని ఆక్రమించాడు. రాహువు ఈ సంవత్సరంలో 1వ ఇంటిని మరియు 12వ ఇంటిని ఆక్రమించాడు. 2023 డిసెంబర్ 27 వరకు కేతువు 7వ ఇంట్లో ఉంటాడు.

కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితి
కుటుంబం ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చాలా బాటుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. తరచూ ప్రయాణాలు చేస్తారు, ఆస్థి వ్యవహారాలు , కోర్టు వ్యవహారాలు పరిష్కరింపబడుతాయి. వ్రుత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు

ఆరోగ్యం
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధువర్గంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో విభేదాలు ఉంబడవచ్చు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉపాది మరియు వ్యాపారం
కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక రంగం వారు అభివ్రుద్ది చెందుతారు. వ్యవసాయదారులు కొత్త పంటలు వేస్తారు.
ఉద్యోగస్తులకు చాలా బాగుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లు , ఫైనాన్స్ రంగం వారు సమయానికి డబ్బు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పురోహితులకు, పండితులకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. విదేశీయానం చేసే అవకాశం ఉంది.

ఉన్నత విద్యకు మంచి సమయం
మేషరాశి విద్యకు అనుకూలమైన సమయం. బృహస్పతి బండిరో వలన జ్ఞానం పెరుగుతుంది మరియు ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత చదువులు చదవాలని అనుకున్న వారందరికీ మేలు జరుగుతుంది. ఉన్నత చదువులకు ఇది మీకు మంచి సమయం. మీరు నేర్చుకునే అవకాశాలతో పాటు మంచి సౌకర్యాలను పొందుతారు. చదువు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా పెరిగాయి.

ఇల్లు, వాహన కొనుగోలుకు మంచి సమయం
మేషరాశి వారు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, స్థలం, కారు పొందాలనుకున్నా, తప్పకుండా ఈ ఉగాది తర్వాత ఈ శుభకార్యం చేయవచ్చు. మీరు అనుకున్నదంతా జరుగుతుంది. ఏదైనా పని చేయాలనుకుంటే ఈ ఏడాదిలోనే పూర్తి చేయండి. అప్పుల బాధ తొలగిపోతుంది. మీరు కోల్పోయిన శాంతి మరియు ప్రశాంతతను మళ్లీ కనుగొనండి.

మేషరాశి అదృష్ట సంఖ్య
మేషరాశి వారికి అధిపతి అంగారకుడు మరియు అదృష్ట సంఖ్యం 6 మరియు 9 గా పరిగణిపంబడుతుంది. ఈ 2023తో మేషరాశివారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. జీవితంలో అన్ని అంశాలలో విజయం సాధిస్తారు.
శని మరియు బృహస్పతి యొక్క శుభ ఫలితాలు పొందుతారు. ఇది మీ జీవితంలో మంచి స్థాయికి తీసుకెళుతాయి. ఉద్యోగంలో విజాయాన్ని పొందుతారు.

జ్యోతిష్య పరిష్కారాలు :
- మీరు మంగళ వారం హనుమాన్ చాలీసా చదవండి.
- బుధవారం సాయంత్రం ఒక ఆధ్యాత్మికపరమైన ప్రదేశంలో నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి.
- ఇంట్లో మహామ్రుత్యుంజయ యంత్రాన్ని స్థాపించి ప్రతి రోజూ పూజించండి.
- పసుపు బియ్యం వండి బ్రుహస్పతి మరియు సరస్వతి దేవికి నైవేద్యం పెట్టి పూజించండి.
- అలాగే గురువారం నాడు ఉపవాసం ఉండండి తలస్నానం చేసిన తర్వాత పసుపు, కుంకుమ ధరించండి.
మొత్తానికి ఈ ఏడాది ఉగాది పంచాంగం ప్రకారం మేష రాశి వారికి పూర్తి శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం సంతోషంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
