Latest Updates
-
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
వాశి రాజయోగం 2023: సింహ రాశిలోకి సూర్య సంచారం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, బతుకు బంగారం.. మీరున్నారా?
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, సంచారం, తిరోగమనం అందరి జాతకాలపై ప్రభావం చూపిస్తాయి. గ్రహాల నిర్దిష్ట కదలిక వల్ల కొన్ని రాశుల వారు లాభపడితే, మరికొన్ని రాశుల వారు నష్టపోతారు. కొందరు అనుకూల ఫలితాలను అందుకుంటే.. మరికొందరు ప్రతికూల ఫలితాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని రాశుల వారికి విపరీతంగా అదృష్టం కలిసి వస్తే, మరికొన్ని రాశుల వారు ఏ పని తలపెట్టినా అందులో ఓటమి ఎదుర్కొంటారు.

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని నవగ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా రాశులను మారుతుంటాడు. ఈ విధంగా ఆగస్టు 17వ తేదీన తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా గ్రహాలు తమ సొంత రాశిలోకి సంచరించిన సమయంలో వారికి గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. జీవితం ఆనందంగా, సంతోషంగా, హాయిగా సాగుతుంది. సమస్యలు ఎదురైనా వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆగస్టు 17వ తేదీన సింహ రాశిలోకి సూర్యుడు సంచరించడం వల్ల వాశి రాజయోగం ఏర్పడనుంది.
ఈ వాశి రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారిపై ఉండనుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి కాలం కలిసి వస్తుంది. ఈ సమయం చాలా అద్భుతంగా ఉండనుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. కెరీర్ లో పురోగతిని చూడబోతున్నారు. వాశి రాజయోగం వల్ల లాభపడే ఆ 3 రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సింహరాశి:
ఆగస్టు 17వ తేదీన ఏర్పడనున్న వాశి రాజయోగం వల్ల సింహ రాశి వారి జీవితంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. సొంత రాశిలోకి సూర్యుడి సంచరించడం వల్ల ఏర్పడే వాశి రాజయోగం సమయంలో.. సింహ రాశి స్థానికులు ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వాశి రాజయోగం వల్ల కుటుంబ కలహాలు తగ్గి, సాన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సింహ రాశి వారికి వ్యాపారాంలో లబ్ధి చేకూరుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి సహోద్యోగులు, ఉన్నతోద్యోగులు నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎక్కువ జీతం వచ్చే మరో ఉద్యోగంలోకి మారితే మరింతగా కలిసి వస్తుంది.
వృశ్చికరాశి:
వృశ్చిక రాశి వారికి వాశి రాజయోగం మంచి ఫలితాలను అందించనుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలను అందుకుంటారు. లాభాలు వస్తాయి. పురోగతి లభిస్తుంది. కష్టానికి రెట్టింపు ప్రయోజనం అందుకుంటారు. శ్రద్ధగా చేసే పనుల వల్ల మంచి గుర్తింపు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తుల సమస్య తొలగిపోతుంది. కొత్త ప్రాపర్టీలను చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి వాశి రాజయోగం శుభం కలిగిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపార వృద్ధి, వృత్తిలో మంచి లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చుల తగ్గించుకోగలిగి, వాటిని పెట్టుబడిగా పెడితే వచ్చే లాభాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. విదేశాల్లో చదువు, ఉద్యోగం చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications