Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
వృచ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!
ఒక రాశిలో ఒక గ్రహ సంచారం వలన ఇంకో రాశివారి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. అలానే ప్రస్తుతం వృచ్చిక రాశిలో శుక్రుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా పలు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. వారి కోరికలు నెరవేరడంతో పాటు వారు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని అనార్ధాలు కూడా జరిగే అవకాశముంది. వ్యామోహాలు, కోరికలు పెరిగిపోవడం, అధికార, ధన దాహంతో పలు రాశుల వారు విర్రవీగిపోవడం వంటివి జరుగుతాయి. అయితే ఆ రాశులు ఏవేవి, ఏ ఏ రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం
వృషభం: ఈ రాశిలో శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా వృషభం రాశి వారికి విపరీతమైన ధనదాహం పెరుగుతుంది. ఎంత శ్రమకైనా ఓర్చి డబ్బులు సంపాదిస్తారు. షేర్లు, వడ్డీ వ్యాపారాల్లో మంచి వృద్ధి కనబరుస్తారు. స్త్రీ వ్యామోహం పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత కూడా మెరుగయ్యే అవకాశముంటుంది.

కర్కాటకం: ఈ రాశిలో శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానమంటే ఆలోచన స్థానమనే అర్ధం. దీని కారణంగా కర్కాటక రాశివారికి సంపద మీద ద్రుష్టి కేంద్రీకృతమై ఉంటుంది. సొంత పనులు, వ్యక్తిగత పురోగతిపైన శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు, ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. సరికొత్త విధాలుగా సంపాదనను సృష్టించుకోగలుగుతారు. సంతానం లేనివారికి, సంతాన కలిగే అవకాశముంటుంది.
సింహరాశి: ఈ రాశి వారికి చతుర్థి, అంటే నాలుగో స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. చతురు స్థానానికి సుఖ సంతోషాలకు స్థానమనే పేరుంది. దీని కారణంగా సింహరాశి వారు తమ జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవాలనే తపన పెరిగిపోవడంతో.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడంతో పాటు.. శృంగారానికి, వ్యసనానికి అలవాటు పడే అవకాశముంది.
తులారాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాంటి శుక్రుడు ధన స్థానమైన వృచ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల.. తులారాశి వారికి, అత్యధికంగా దానం కూడబెట్టడమే లక్ష్యంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక విధాలుగా ధనాన్ని సంపాదించే అవకాశముంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటు.. అక్రమ సంబంధాలు, రహస్య వ్యవహారాలు కూడా పెరిగే అవకాశముంటుంది.
వృచ్చిక: ఈ రాశిలో శుక్రుడి ప్రవేశం కారణంగా.. వృచ్చిక రాశి వారికి వివిధ మార్గాల నుంచి ఆదాయం సమకూరుతుంది. ఈ రాశి వారిలో కూడా డబ్బులు సంపాదించాలనే పట్టుదల మెరుగవుతుంది. వృచ్చిక రాశిలోనే శుక్రుడి సంచారం కారణంగా.. స్త్రీ వ్యామోహం, అక్రమ సంబంధాలు, రహస్య కార్యక్రమాలు పెరగనున్నాయి. ఆదాయనానికి లోటు ఉండనప్పటికీ.. ఖర్చు, భోగ భాగ్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
మకరం: ఈ రాశి వారికి శుక్రుడు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మకర రాశి వారు తలపెట్టి ప్రతీ కార్యక్రమం లాభదాయకంగా సాగుతుంది. వద్దన్నా.. వివిధ మార్గాల నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. డబ్బు సంపాదించే విషయంలో.. ఎంతటి ప్రమాదం ఎదురైనా.. నిలదొక్కుకొని, డబ్బులు సంపాదించే అవకాశముంటుంది. అన్ని రంగాల వారు అమితంగా రాణించి.. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. దాంపత్య జీవితం మునుపెన్నడూ లేనంత ఆనందంగా, అన్యోన్యంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications