Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు.. ప్రేమ, సంపద, అందం, వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే శుక్ర గ్రహం తాన రాశి మార్చుకున్నప్పుడల్లా అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. కాగా, సెప్టెంబర్ నెల మొదటి రోజే ఈ గ్రహం తన రాశిని మార్చుకుంటుండటంతో నాలుగు రాశుల వారికి ఎనలేని అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి.. వారి జీవితంలో కలిగే మార్పులేంటి చూద్దాం..

ఈ ఏడాది సెప్టెంబర్ 1న, శుక్రుడు కన్యారాశిని వదిలి తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు పలువురి జీవితాల్లో పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురానున్నాయి. వీరికి అదృష్టం కలిసివచ్చి, ఉద్యోగం, కెరీర్‌లో ప్రయోజనాలు, అదేవిధంగా భారీగా ధన ప్రవాహం వచ్చి చేరనుంది.
మేష రాశి
శుక్ర గ్రహ సంచారం మేష రాశిలో జన్మించిన వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనిలో కష్టానికి తగిన గుర్తింపు అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం రెట్టింపవుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి శుక్ర గ్రహ సంచారం ఆర్థిక లాభాలను తీసుకురావడంతో పాటు వృత్తిపరంగా పురోగతి అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రమోషన్లు, జీతం పెరుగుదల ఇలా శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కీలక ఒప్పందం కుదుర్చుకుంటారు. బయట వ్యక్తుల వద్ద మీ డబ్బులు తిరిగి మీకు దక్కుతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్త అందుకోవచ్చు. ప్రేమికులకు ఇది మంచి సమయం.

సింహ రాశి
తులారాశిలోకి శుక్ర గ్రహ సంచారం సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు అందుకుంటారు. పై అధికారుల వద్ద ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది. విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
తులా రాశి
శుక్రుడు తులారాశిలోనే సంచరిస్తుండటం వల్ల వీరికి గణనీయమైన ప్రయోజనం పొందనున్నారు. ఉద్యోగాలు, వ్యాపార రంగంలో ఊహించని పురోగతి లభిస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తూ సంతోషకరమైన, లగ్జరీ జీవితం గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
