Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
Weekly Horoscope : (ఏప్రిల్ 22 - ఏప్రిల్ 28) అన్ని రాశులవారిపై ప్రేమసంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..!
ఏప్రిల్ 22 - ఏప్రిల్ 28 వరకు ప్రేమికులు తమ ప్రేమ విషయంలో ఏ రాశివారు ఎలా ఉన్నారో తెలుసుకోండి..! ప్రేమ చిగురించడం మన చేతుల్లో ఉంది కానీ ఆ ప్రేమకు బలం బలహీనతలపై గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ వారం ఎవరి ప్రేమలో బలం ఉందో ఎవరి ప్రేమ అడ్డంకులను ఎదుర్కొంటుందో చూద్దాం.
మేష
మీ జీవిత భాగస్వామి నుంచి మీరు గతంలో ఎప్పుడూ ఊహించని సర్‌ప్రైజ్‌ను చూస్తారు. అది ఎలాంటి సర్‌ప్రైజ్ అయినప్పటికీ మిమ్మల్ని మీరు దానిని తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మంత్రముగ్ధులను కూడా చేయొచ్చు. మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా వ్యవహరించి మాట్లాడండి, ప్రకృతి విసిరే ఛాలెంజ్‌లను ధైర్యంగా స్వీకరించండి.
వృషభం
ఈ రాశిలో బ్రహ్మచారులు లేదా పెళ్లికాని వారు ఉంటే, ఇక వారికి పెళ్లి కుదిరే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రేమను పంచుకోవడానికి ఒకరు మీ జీవితంలోకి వస్తారు. ఇంత కాలం ఒంటరిగా ఉన్న మీకు ఈసారి ఓ తోడు మీకోసం దరిచేరుతుంది. ఈ వారం మీ జీవితంలో ప్రేమను నింపుతుంది.

మిథునం
ప్రేమ విషయంలో ఈ రాశివారు కొన్ని ఛాలెంజులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అప్పుడు మీకు కలిగే కష్టాలను లోలోపల దిగమింగి కుమిలిపోకుండా మీ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోండి లేదా వాటన్నింటినీ డైరీలో రాసుకొని మిమ్మల్ని తేలిక పరచుకోండి.
కర్కాటకం
మీ బంధువుల్లోనే మీకు ఓ జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. దీని గురించి మీ ఇంట్లో వారితో చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. అధైర్య పడకుండా మీ మనసులోని భావాలను మీ కుటుంబసభ్యులకు తెలపండి.
సింహరాశి
ఈ రాశివారికి ప్రేమ విషయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురౌతాయ్. దీనిపై ఎక్కువ వాదనలకు దిగకుండా కొంత మౌనం పాటిస్తే మీ రిలేషన్‌షిప్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమయాన్ని మీ పార్ట్‌నర్‌ను మరింత బాగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి.
కన్య
మీ రిలేషన్‌షిప్‌కు సంబంధించి భావోద్వేగానికి లోనౌతారు. మీకున్న కష్టాలను మీ జీవితభాగస్వామితో చెప్పుకోండి. అప్పుడు మీ మనస్సుకు ఎక్కడా దొరకని మనశ్శాంతి లభిస్తుంది.
తుల
పెళ్లికానివారు జీవిత భాగస్వామి కావాలని బలమైన కోరికతో ఉంటారు. వారి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అలాంటి వారు కలిసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి మెండుగా ఉన్నాయ్. ఒకవేళ కలిస్తే మంచి సంభాషనలతో ముందుకు వెళ్లండి.
వృశ్చికం
మీ ఇద్దరి మధ్య గతంలో పరిష్కారం కాని పాత గొడవలు మళ్లీ తెరపైకి వస్తాయ్. ఈ వారం మొత్తం అనుకోని సమస్యలతో బాధపడుతుంది. మీ జీవితభాగస్వామి ముందు ఓపికతో, ప్రేమతో ఉన్నప్పుడే ఈ సమస్యను గట్టెక్కగలుగుతారు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు
మీ లైఫ్ పార్ట్‌నర్ మీకు దొరికే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉండండి. జరిగే సంఘటనలను అలాగే జరగనివ్వండి. సహనంతో ఉంటే ఈ వారం చివరికల్లా మీకు మీ పార్ట్‌నర్ లభిస్తారు.
మకర
మీ జీవితభాగస్వామి కష్టాలను ఎదుకోవచ్చు. అప్పుడు మీ ప్రేమ సహాకారం వారికి చాలా అవసరమౌతాయ్. ఆచితూచి మీ పార్ట్‌నర్‌తో సంభాషించండి. ఒంటిరిగా ఉన్నవారికి ఓ తోడు దొరికే అవకాశాలు ఉన్నాయ్.
కుంభ
మీకు ఓ ముఖ్యమైన వ్యక్తి పరిచయమయ్యే అవకాశం ఉంది. వారే మీ జీవితంలో పార్ట్‌నర్ కావచ్చు. కాబట్టి జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్లండి. కానీ వారు ఎలాంటి వారో ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారితో బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఈ వారమే రావచ్చు.
మీన
మిమ్మల్ని ఆకర్షించడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. అప్పుడు మీ తెలివితేటలను ఉపయోగించండి. ఈ పరిచయం మీ బంధాన్ని కూడా దెబ్బతీయవచ్చు కాబట్టి ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా సాఫీగా సంభాషణ జరిగేలా జాగ్రత్త పడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
