Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఈ రాశులకు చెందిన వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే నష్టమే..!
తాబేలు ఉంగరం దరిస్తే అదృష్టమని మనకు తెలిసిందే కానీ అందరూ ఈ ఉంగరాన్ని ధరించకూడదు. కేవలం కొందరు మాత్రమే ఈ తాబేలు ఉంగరాన్ని ధరించాలి. జ్యోతిష్యం ప్రకారం 4 రాశులకు చెందిన వారు తాబేలు ఉంగరాన్ని ధరించవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. తాబులు ఉంగరాన్ని ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయ్. ఏ రాశులకు చెందిన వారు తాబేలు ఉంగారన్ని ధరించవద్దు, ఎందుకు ధరించవద్దో తెలుసుకుందాం. ధరిస్తే ఎలాంటి సమస్యలను వారు ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం.

తాబేలు నీటిలో నివసించే జంతువు. తాబేలును శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అదృష్టాన్ని, సంపదను, ఆరోగ్యాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు. తాబేలు ఉంగరాన్ని ధరించే వక్తి ఎల్లప్పుడూ సంతోషంగా, సానుకూలతతో వుండాలని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. పురాణాల ప్రకారం విష్ణువుకున్న పది అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి. లక్ష్మీ దేవి నీటి నుంచి పుట్టించి కాబట్టి లక్ష్మీ దేవిని కొలిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే తాబేలు ఉంగరాన్ని ధరించిన వారు కూడా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కానీ తాబేలు ఉంగరాన్ని ఇష్టం వచ్చినట్టు ధరించకూడదు.
తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురాతన కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి.. తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు నియమాలు పాలించడం చాలా అవసరం.
తాబేలు ఉంగరాన్ని ఎప్పుడూ కుడి చేతికి మాత్రమే ధరించాలి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందే రోజు కాబట్టి అదే రోజు తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి ధరించాలి. తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు దాని ముఖం మనకు ఎదురుగా వుండాలి, వ్యతిరేక దిశలో వుండకూడదు. అలా వేంటే మనకు అశుభ ఫలితాలను ఇస్తుంది.

తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు దాన్ని పచ్చిపాలలో కొన్ని నిమిషాలు నానబెట్టాలి. ఉంగరాన్ని లక్ష్మీ దేవి ఫోటో ముందు పెట్టి పూజించాలి. పదే పదే ఉంగరాన్ని తీయటం కూడా మంచిది కాదు. ఉంగరాన్ని ధరించడం వల్ల దైవిక శక్తి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయ్. ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో వారికి సంపద, శ్రేయస్సు లభిస్తుంది. వ్యాపారంలో నష్టపోతే ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల చాలా లాభాలను పొందుతారు. విష్ణువు, లక్ష్మీ దేవికి తాబేలు దగ్గరి సంబంధం కావడం వల్ల ఈ ఉంగరాన్ని ధరిస్తే సంపద ప్రాప్తి లభిస్తుంది.
ఈ ఉంగరం మకర రాశి వారికి శుభప్రదంగా చెప్పబడుతుంది. తాబేలు ప్రతిమని ఇంట్లో పెట్టుకుంటే కూడా అన్ని దోషాలూ తొలగిపోతాయ్. సుఖమైన జీవితాన్ని పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కూడా తాబేలు ఉంగరం ధరిస్తే ఉపశమనం పొందినట్లు చాలా సంఘటనలు వున్నాయ్. మేషరాశి వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. మేషానికి అధిపతి అంగారకుడు కాబట్టి మంచిది కాదని చెబుతున్నారు. కన్యా రాశివారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. తాబేలుకు అధిపతి బుధుడు, కాబట్టి ఈ రాశివారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించవద్దు. వృశ్చిక రాశివారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరిచంవద్దు. ఈ రాశికి అధిపడు అంగారకుడు కాబట్టి వద్దని శాస్త్రం చెబుతోంది. మీన రాశి వారు మరిచిపోయి కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. తాబేలు నాలుగు కాళ్లూ ధర్మ, అర్థ, మోక్ష, కామానికి ప్రతీకగా చెబుతారు. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతుంది. ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన వివరాలు ప్రముఖ పండితుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications