Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
బియ్యం నుంచి రక్తం పుట్టించవచ్చా..?

ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనాన్ని సెంట్రల్ చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో డాక్టర్ దాయ్‌చాంగ్ యాంగ్ బృందం నేతృత్వంలో నిర్వహించారు. వీరు ఎలుకలపై అనేక పరిశోధనలు జరిపారు. బియ్యం నుంచి ఉత్పత్తి చేసిన రక్తాన్ని ఎలుకల్లో ఉపయోగించినపుడు వాటిలో ఎలాంటి ప్రతికూల చర్యలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
రక్తంలో కీలకమైన ప్రొటీన్ 'హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్'(హెచ్ఎస్ఏ)ను బియ్యం నుంచి అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పక్రియ కోసం వరి వంగడాల్లో మానవ జున్యువులను ప్రవేశపెట్టి వైద్య పరంగా ఉపయోగపడే విధంగా కొత్త వంగడాన్ని అభివద్ది చేశారు. అనంతరం రైస్ సీడ్ బయోరియాక్టర్ ను ఉపయోగించి బియ్యపు గింజల నుంచి హెచ్ఎస్ఏ బయటకు తీయగలిగారు. ఇది మానవ రక్తంలోని ప్రొటీన్ కు ఏమాత్రం తీసిపోదు.
హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్' అనేది మానవ రక్తంలో ప్రధానంగా ఉండే ప్రొటీన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రొటీన్ కొరత తీవ్రంగా ఉంది. తాజా విధానం ద్వారా బియ్యం నుంచి భారీ ఎత్తున మానవ రక్తాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రక్తం కొరత తీరుతుంది. భారీ సంఖ్యలో రోగులకు మేలు జరుగుతుంది. ఇప్పుటి వరకు మనుషులు నుంచి సేకరించిన రక్తం ద్వారా హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. అదే, బియ్యం నుంచి రక్తం ఉత్పత్తి అయితే అలాంటి ముప్పు కూడా ఉండదు.
పరిశోధన వివరాలను 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'కు చెందిన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications
