Latest Updates
-
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్‌లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు? -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి! -
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే!
మేనిక్యూర్... పెడిక్యూర్ అంటే ఏమిటి... ఎలా చేసుకోవాలి...?

గోళ్లను పొట్టిగా కత్తిరించుకోవడం వల్ల లోతుగా పెరుగుతాయ. అడ్డదిడ్డంగా కత్తిరించుకోవడం వల్ల గోళ్ల పలకలు పగుళ్లకు దారితీస్తాయి. గోళ్ల విషయంలో ముఖ్యంగా కాలిగోళ్ల విషయంలో రోజూ శుభ్రత పాటించడం, పొడిగా ఉంచుకోవడం అవసరం. గోళ్లను కట్ చేసుకున్నాక సరిగా ట్రిమ్ చేసుకోండి. కాళ్లకు పారాణి ఎంత అందమో గోరు అంతకుమించి అందం. అలాంటి గోళ్లను ఆకర్షణీయంగా మెరుగుపరుచుకునే పద్ధతి పెడిక్యూర్. ఇది లాటిన్ పదం.
లాటిన్ లో పెస్ అంటే పాదము క్యూర్ అంటే రక్షణ. చేతులను, చేతివేళ్ల గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మేనిక్యూర్. మేనిక్యూర్‌తో చేతివేళ్లకు, చేతులకు, గోళ్లకు కూడా రక్షణ. చేతివేళ్లను మృదువుగా చేసేందుకు తగిన పదార్థాలలో నానపెట్టడం, అవసరాన్ని బట్టి తగిన లోషన్లు రాయటం, ఇదే పద్ధతిలో కాలివేళ్లకు చేసేది పెడిక్యూర్. పేర్లు వేరయినా పద్ధతి అటూఇటూగా ఒక్కటే.
కాబట్టి... చేతులు కడిగే ప్రతిసారీ తప్పనిసరిగా టవల్ తో తుడవాలి. లేకపోతే డీ హైడ్రేషన్ వల్ల చేతులు పొడిబారిపోతాయి. అలాగే తరచుగా గ్లౌజులు ఉపయోగించటం తప్పనిసరి అయితే, ముందుగా చేతులకు పౌడర్ రాసుకుని ఆ తరువాత గ్లౌజులు వేసుకోవాలి. లేదంటే... చెమటవల్ల చేతులు త్వరగా డీ హైడ్రేషన్ కు గురవుతాయి.
చేతులకు తీసుకునే ట్రీట్‌మెంట్‌నే మేనిక్యూర్ అంటారు. మేనిక్యూర్ అనేది లాటిన్ పదము. మేని అంటే చేయి అని క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. మేనిక్యూర్ ఎలా చేయాలంటే...
బాగా వెలుతురులో కూర్చుని ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేయాలి. దీనికోసం కాస్తంత దూదిని తీసుకుని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి, ఆ దూదిని గోరుపై ఉంచి తుడిస్తే చెరిగిపోతుంది. తరువాత గోళ్ళను అందంగా ట్రిమ్ చేసుకోవాలి. ఈ సమయంలో ఫైలర్‌ను ముందుకు, వెనుకకు గట్టిగా రుద్దకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, అలా చేస్తే గోర్ల అంచులు బలహీనమై త్వరగా పగిలిపోతాయి.
ఇలా రెండు చేతులు గోళ్లను ట్రిమ్ చేశాక.. ఒక ప్లాస్టిక్ గిన్నెలో సోప్ వాటర్‌ను పోసి... అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి కలిపి రెండు చేతుల వేళ్ళు మునిగేలా అందులో ఉంచి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయడంవల్ల గోళ్లలో ఉండేటటువంటి మలినాలు, సూక్ష్మజీవులు నశించి రఫ్‌గా, గట్టిగా ఉండే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరుచుట్టూ చర్మం కూడా మెత్తబడుతుంది. ఆ తరువాత రెండు చేతులను తీసి తడిలేకుండా టవల్‌తో తుడుచుకోవాలి.
ఇక చివరగా ఒక ఆరెంజ్ స్టిక్‌కు ఒకవైపు దూదిని చుట్టి క్యూటికల్ రిమూవర్‌లో ముంచి దాన్ని గోరుచుట్టూ రాసి, గోరుచుట్టూ కిందకి నొక్కి గట్టిగా తీయాలి. ఇంకా ఏవయినా క్యూటికల్ బిట్స్ మిగిలివుంటే వాటిని కూడా తీసివేయాలి. ఇలా చేయడంవల్ల గోరు పెద్దదిగాను, అందంగాను కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే.. చేతివేళ్లు, గోర్లు ఆరోగ్యంగా, అందంగా ఉండటమే గాకుండా... చూడగానే ఇట్టే ఆకర్షించేలాగుండే చేతుల సౌందర్యం మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications