Latest Updates
-
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి..
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్!
కోడి మాంసం పేరు వింటేనే మాంసాహార ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికీ చికెన్ వండటంలో ఒక ప్రత్యేకమైన శైలి, విభిన్నమైన మసాలా రుచులు ఉంటాయి. మధ్యాహ్న భోజనమైనా, రాత్రి విందైనా చికెన్ వంటకం ఉంటే ఆ మజానే వేరు. ముఖ్యంగా స్పైసీగా, ఘుమఘుమలాడే చికెన్ వంటకాలను ఇష్టపడని వారుండరు.
సాధారణంగా మనం కరివేపాకును తాలింపులో వేసి, తినేటప్పుడు పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఆ కరివేపాకునే ప్రధాన రుచిగా మారిస్తే ఆ వంటకం అద్భుతంగా ఉంటుందో ఈ రెసిపీనే కరివేపాకు చికెన్ రోస్ట్. రెండు రకాల ప్రత్యేక మసాలాలు చికెన్ ముక్కలకు అమోఘమైన రుచిని అందిస్తాయి. కరివేపాకు చికెన్ రోస్ట్ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మ్యారినేషన్ కోసం:
చికెన్ లెగ్ పీసులు - 250 గ్రాములు
పెరుగు - 1/3 కప్పు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - చిటికెడు
మసాలా పొడి కోసం:
కరివేపాకు - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 5
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మసాలా పేస్ట్ కోసం:
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చి మిరపకాయలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - 1 టేబుల్ స్పూన్
తాలింపు,ఇతర పదార్థాలు:
పెద్ద ఉల్లిపాయ - 1
గరం మసాలా - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి!
తయారీ విధానం
-ముందుగా చికెన్ లెగ్ పీసులను శుభ్రంగా కడిగి, మసాలాలు లోపలికి పట్టేలా చిన్న గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో చికెన్ ముక్కలు వేసి పెరుగు, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి సుమారు 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. దీనివల్ల ముక్కలు మృదువుగా, జ్యూసీగా ఉడుకుతాయి.
-ఇప్పుడు స్పెషల్ మసాలా పొడి కోసం స్టవ్ మీద బాండీ పెట్టి మిరియాలు, ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. కరివేపాకు కరకరలాడుతూ కమ్మని సువాసన వచ్చేవరకు వేయించాక స్టవ్ ఆపేసి చల్లార్చి తర్వాత మిక్సీ జార్ లో మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
-మరొక మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్, రుబ్బిన అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మసాలా పొడిని వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-చివరగా రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా చల్లి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. మసాలా అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ సన్నని సెగపై నూనె తేలేవరకు రోస్ట్ చేసుకుని స్టవ్ ఆపేయండి.
-అంతే ఘుమఘుమలాడే, స్పైసీగా నోరూరించే కరివేపాకు చికెన్ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
