Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
శరీరంలో వేడి తగ్గించే వేసవి పానియాలు...!

నిమ్మకాయ: నిమ్మలో విటమిన్ సి అపారం. నిమ్మ ఆరోగ్య ప్రదాయని. 100 గ్రాముల నిమ్మపండు నుంచి 40 కేలరీల శక్తి లభిస్తుంది. నిమ్మలోని పోషక విలువలు మెదడు చురుకుగా పనిచేయడానికి, దంతాలు ఎముకలు పటిష్టంగా పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. రోజూ నాలుగుసార్లు నిమ్మరసం తాగితే పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగినట్టయితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎండ వేడిమి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పానీయంగానూ ఆస్వాదిస్తుంది.
ఆరెంజ్(నారింజ): నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ - ఏ, బి స్వల్పంగా, విటమిన్ - సి ఎక్కువగా ఉంటాయి. ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్ లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది. నారింజ తొనల చర్మంలో కాల్షియం ఎక్కువ. తీపి నారింజలో చక్కెర ఎక్కువ. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, నారింజలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి కాబట్టి, నారింజ సులభంగా జీర్ణ అవుతుంది.
కొబ్బరి బొండాం: ప్రకృతి ప్రసాధించిన శీతల పానీయం. ఎండ వల్ల నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దప్పిక తీరిపోతుంది. అలసట గాలికెగిరిపోతుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బయటినుంచి వచ్చాక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరినీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది.
నీళ్ళు: వేసవికి మందు మంచినీళ్లే. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. బయటికివెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లుతీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.
మామిడి: మామిడి ఫలాల్లో రారాజు. వేసవిలో విరివిగా లభించే మామిడి పండుతో రుచిలో కానీ వైవిధ్యంలో కాని సాగి వచ్చే పండు మరోటి లేదు. ఒక గ్లాసు మామిడి పండు రసంలో కొంచెం తేనె కలిపి తగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మామిడి పండు తినడం వల్ల చూపు కూడా బాగుంటుంది. చర్మానికి మెరుపు కూడా వస్తుంది. మామిడి జీర్ణశక్తికీ ఎంతో సహకరిస్తుంది.



Click it and Unblock the Notifications