Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అధిక పొట్టా.....గణనీయంగా తగ్గే చిట్కాలు....

1. బరువు పెరుగుతున్నప్పుడు పొడిగా, వేడిగా ఘూటుగా ఉండే పదార్థాలు(స్పైసీ ఐటమ్స్) భోజనంలో తసుకోవాలి. పుల్కాలు, మిరియాలు, లవంగాలు, పచ్చిమిర్చి యాలకులు, గోరువెచ్చని నీళ్ళకు ప్రాధాన్యమివ్వడం మంచిది.
2. కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, అనప,పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.
3. పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.
4. అరటీస్పూన్ మెంతి పొడినీళ్లలో కలిపి రాత్రిపూట మూలం, వందగ్రాముల వరిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవడం రకరకాల పిండి పదార్థాలతో బయట చేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం తినాలి.
5. చిన్న తట్టలో (పళ్ళెం)భోజనం తినాలి. మీకు తెలీకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు.
6. భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం 30ని ఒక్కసారి నీళ్ళు త్రాగండి.
7. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి.
8. కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.
9. సహజంగా లభించే గ్రీన్ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
10 బార్లీ గింజలు: అధిక బరువును అరికట్లే ఆహార పదార్థం బార్లీ. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొనే తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.
11. నేను ఫలానా పది కేజీల బరువు తగ్గ దలుచుకున్నాను అని స్నేహితులు అందరికీ చెప్పండి. ఒక వేళ బరువు తగ్గాడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే జనాలు అడుగుతున్నప్పుడైనా చురుక్కుమని తగిలి కర్తవ్యం గుర్తు వస్తుందిటి.



Click it and Unblock the Notifications
