Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మృత చర్మాన్ని తొలగించి శరీరాన్నితాజాగా ఉంచే బాత్ సాల్ట్...!
మీరు ఒక మంచి షవర్ బాత్ చేయాలనుకొంటున్నారా?. అయితే మీ శరీరాన్ని శుభ్రపరచడానికి షవర్ బాత్ ఒక్కటే సరిపోదు. షవర్ బాత్ కొరకు వినియోగించే నీళ్ళలో కొన్ని లవణాలు(బాత్ సాల్ట్) కలవడం ద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. బాత్ సాల్ట్ ను ఉపోగించడం వల్ల శరీరం తాజాగా ఉండటమే కాకుండా చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి మృత చర్మాన్ని తొలగించాడానికి, చర్మం ఫ్రెష్ గా ఉండటానికి ఇది బాగా సహకరిస్తుంది. కాబట్టి ఇంట్లోనే స్నానానికి బాత్ సాల్ట్ చాలా సులభంగా తయారుచేసుకోచ్చు. కాబట్టి మీ అందాన్ని పెంచుకోవడానికి మీ యొక్క సృజనాత్మకతను వెలికితీసి ప్రయత్నించండి.

డెడ్ సీ సాల్ట్ తో ఎసెన్సియల్(పరిమళించే వాసనలు కలిగిన నూనెలు): స్నానాకి ఉపయోగించే సాధనాలలో డెడ్ సీ సాల్ట్ కూడా ఒకటి. ఈ డెడ్ సీ సాల్ట్ కు సువాసననిచ్చే బాదం నూనె, బెర్గ్మెంట్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసి ఈ సాల్ట్ ను వాసన పోకుండా ఉండే ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే ముందు ఒక బకెట్ నీటిలో ఈ బాత్ సాల్ట్ను ఒక చెంచా కలపి తర్వాత స్నానం చేస్తే మీ శరీరాన్ని రోజంతా ఫ్రెష్ గా ఉంచుతుంది.
ఫ్రూట్ బాత్ సాల్ట్: ఆరెంజ్ ఎప్ప్సమ్ బాత్ సాల్ట్ చర్మానికి చాలా మంచిది. ఎప్ప్సమ్ సాల్ట్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీరు ఇంట్లోనే ఒక అద్భుతమైనటువంటి చర్మ సంరక్షణ ఉత్పత్తిని తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే ఆరెంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఈ పొడికి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ను మిక్స్ చేసి మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకొని స్నానానికి ముందు శరీరానికి పట్టించి స్నానం చేసినట్లైతే చర్మ సున్నితంగా, చాలా మృదువుగా తయారువుతుంది.
ఫ్లవర్ బాత్ సాల్ట్: ఇది ఇంట్లో సులభంగా తయారు చేసుకొనేటటువంటి బాత్ సాల్ట్ రిసిపి. సువాసనలు విరజల్లు పూలు, పరిమళభరితమైన నూనెలతో ఫ్లవర్ బాత్ సాల్ట్ తయారు చేసుకోవచ్చు. ఎల్డర్ ఫ్లవర్ మరియు లావెండర్ వంటి పువ్వులను సాధారణంగా సౌందర్య సాధనాలైన హెర్బల్స్ లో ఉపయోగిస్తుంటారు. రోజ్ మెరీ మరియు లైమ్ ఎసెన్సియల్ ఆయిల్ లో ఎల్డర్ ఫ్లవర్ మరియు లావెండర్ పువ్వులను వేసి, దాంతో పాటు డెడ్ సీ సాల్ట్ కూడా మిక్స్ చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తర్వాత ప్రతి రోజూ స్నానానికి ఉపయోగించే నీటిలో వేసి స్నానం చేస్తే మంచి సువాసనతో పాటు మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈ ప్లవర్ బాత్ సాల్ట్ ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది.
పెయిన్ రిలీఫ్ బాత్ సాల్ట్: ఈ రోజుల్లో చాల మందిలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా కనిపంచే సమస్య. అయితే అందుకోసం ప్రతి రోజూ స్పా సెంటర్ల చుట్టూ తిరగడం అంత సులభమైన పనికాదు. కాబట్టి మీకు తక్షణ ఉపశమనం పొందడానికి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో అందులో డెడ్ సీ సాల్ట్, డెడ్రైట్(నరాలకు ఉపయోగపడే) సాల్ట్ , ఎప్సమ్ సాల్ట్, చామోలైన్, లావెండర్ ఎసెన్సియల్ ఆయిల్ తీసుకోవాలి. అందులోనే ఎండిన చామోలైన్, ల్యావెండర్ పువ్వులను పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఒక డబ్బాలో నిలవ్వ చేసుకొని ప్రతి రోజూ స్నానానికి వేడినీళ్ళతో ఉపయోగించనట్లేతే తక్షణ ఉపశమనం కలిగించి రిలీఫ్ ఇస్తుంది.
కాబట్టీ మీరు తాజాగా ఉండాలన్నా, మంచి మెరిసే చర్మం, సున్నితమైన చర్మాన్ని, సహజత్వాన్ని పొందుటకు ఈ హోం మేడ్ సాల్ట్ రిసిపిలు ట్రై చేసి చూడండి. ఈ బాత్ సాల్ట్ శరీరాన్ని శుభ్ర పరచడమే కాకుండా చర్మానికి మాయిశ్చరైజింగాను, శుభ్రపరచడానికి చాలా బాగా సహకరిస్తుంది.



Click it and Unblock the Notifications
