Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
అందమనేది అన్ని శరీర భాగాలకు......

నిమ్మచెక్కతో మోచేతులు రుద్ది..పదినిమిషాల తర్వాత వేడినీటిలో ముంచిన తువాలుతో తుడవాలి. ఇలా రెండు రోజుకోసారి చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
2. గ్లిజరిన్, గులాబీ నీటిని సమపాళ్లో తీసుకుని అందులో దూదిని ముంచి చేతుల్ని తుడుచుకోవాలి. దీనివల్ల మోచేతులు, చేతులూ రెండూ మృదువుగా మారతాయి.
3. అరకప్పు పెరుగులో ఒక టీస్పూన్ వెనిగర్ కలిపి మోచేతులకు పూతలా వేయాలి. దీనివల్ల మృతచర్మం తొలగిపోయి మృదువుగా మారతాయి.
4. పెసర పిండిలో చిటికెడు పంచదార కలిపి మోచేతులకు మర్దన చేయాలి. ఇది స్ర్కబ్ లా పనిచేస్తుంది. ఆరాక కడిగేస్తే సరిపోతుంది.
5. వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకొని కప్పు మొక్కజొన్న పిండి కలిపి అందులో మీ మోచేతులు ఉంచండి. పది నిమిషాలయ్యాక తీసి బ్రష్ తో రుద్దాలి. కడిగేసుకుని నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే మార్పు ఉంటుంది.
6. రెండు టీస్పూన్ల పాలమీగడకు ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, పసుపు చేర్చి రుద్దుకోవాలి, ఆరాక కడిగేస్తే చాలు. మోచేతులు మిలమిల మెరుస్తుంటాయి.
7. విటమిన్ ఇ క్యాప్సూల్ లోని మందు టీస్పూన్ చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్, నాలుగు టీస్పూన్, పాలు కలిపి మోచేతులకు పట్టించాలి. పదినిమిషాల తర్వాత శుభ్రపరచుకుంటే సరి.
8. స్నానం చేశాక కాస్త ఆవనూనెను మోచేతులకు రాసుకుని మర్దన చేయస్తే మోచేతులకున్న నలుపు తగ్గిపోతుంది.
9. చేతుల బిరుసుగా ఉండటం జరుగుతుంది. కారణం ఇంట్లో పనులు ఎక్కువగా చేసి, పాత్రలను శుభ్రం చేసినా, బట్టలు ఉతకడం, బరువుల మోయడం వంటి పనులు చేస్తూవుంటే చేతులు గట్టిగా బిరుసుగా ఉంటాయి. అలాంటప్పుడు చేతులకు కొంచెం పంచదార రాసి రుద్దితే మెత్తపడతాయి. కొంతసేపు తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
10. నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్‌లా, పుదీనారసం యాస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. గరుకుగా ఉన్న మోచేతులు సున్నితంగా తయారవుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. ఇది బ్లీచింగ్ కారకంగానూ పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
