Latest Updates
-
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!
నెయిల్ పాలిష్..నెయిల్ రిమూవర్స్ వాడకంలో మెలుకువలు...
Body Care
oi-Saraswathi
By Sindhu

2. క్రమం తప్పకుండా పెడిక్యూర్’, ‘మేనిక్యూర్’ చేయించుకోవాలి.
3. వారంలో ఒకసారికి మించి నెయిల్ వార్నిష్, రిమూవర్ ఉపయోగించకూడదు. దాంతో గోరు చుట్టూ ఉన్న చర్మంపై చెడు ప్రభావం పడుతుంది.
4. నెయిల్ పాలీష్ వేసుకున్న వారు ఆ చేతితో ఏదో ఒక సమయంలో కళ్లు నులుముకోవటం, మెడ మీద గోకటం వంటివి చేస్తారు. దీంతో సున్నితమైన కంటి చర్మం దగ్గర, మెడ మీద రియాక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు క్లాసుల్లో బుగ్గన చెయ్యిపెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు గోళ్ల రంగులోని రసాయనాలు చాలాసేపు చెంపలకు అంటుకుంటాయి. వాళ్లు బయట ఎండలోకి వచ్చినప్పుడు అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. చెంపల మీద అలర్జీ రియాక్షన్లకు కారణమవుతుంటాయి.
5. నెయిల్ పాలీష్: పాలీష్ చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్ లలో 'ఫార్మాల్డిహైడ్' తప్పనిసరిగా వాడతారు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు.
6. పాలీష్ రిమూవర్స్: దీనిలో ప్రధానంగా రంగును కరిగించే సాల్వెంట్ రసాయనం 'అసిటోన్' ఉంటుంది. దీనివల్ల గోరుచుట్టూతా ఎర్రగా వచ్చి దురదలూ, మచ్చలు, నీరు కారటం వంటి దుష్ప్రభావాలన్నీ ఉంటాయి. ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ అవి మొదలైనప్పుడు వెంటనే గుర్తించటం చాలా అవసరం.
Comments
English summary
Nail Polish Remover Tips for Healthy Nails... | నెయిల్ పాలిష్..నెయిల్ రిమూవర్స్..
Story first published: Tuesday, March 20, 2012, 16:55 [IST]
Other articles published on Mar 20, 2012



Click it and Unblock the Notifications
