Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతుల దుస్తుల సౌకర్యం....

నాలుగవ నెల నుండి ఆరవ నెలవరకూ (సెకండ్ ట్రైమిస్టర్) పొట్ట ఒత్తిడికి లోనవుతుంది. పెరుగుతున్న బరువు, పొట్ట సైజు, శరీరాకృతి, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని... ఉలెన్, కాటన్ దుస్తులు వేసుకోవచ్చు. సౌకర్యంగా అనిపించిన సైజును వెంటనే తీసుకోకుండా, దానికంటే ఒక నంబరు పెద్దది తీసుకోవాలి ఈ సమయంలో చెమటలు ఎక్కువ. కాబట్టి దుస్తులు వదులుగా ఉండాలి. నెలలు పెరిగేకొద్దీ దుస్తులు బిగుతుగా అవుతాయి, వాటి వల్ల దేహం నొక్కుకుపోయి గుంతలు, మచ్చలు పడతాయి. కాబట్టి దేహం సైజ్ మారిన వెంటనే పెద్దవి తీసుకోవాలి. అలాగని ఎక్కువ తీసుకుంటే ప్రసవం తర్వాత మూడు నెలలకు దేహం యధాస్థితికి వచ్చేస్తుంది కాబట్టి తర్వాత అవి వృథా అవుతాయి.
కాబట్టి ఒక్కో సైజువి రోజువారీ వాడుకకు తగినట్లు కొంటే చాలు ప్యాంటు, స్కర్టులు (బటన్, హుక్ లేకుండా) ఎలాస్టిక్ వి తీసుకోవాలి. టీషర్టులు, షార్ట్ కుర్తాలను మానేసి లాంగ్ కుర్తాలను వేసుకొంటే పొట్టను కవర్ చేస్తాయి. వదులుగా ఏదైనా సరే వదులుగా ఉండాలి. మరో ప్రాణి రూపుదిద్దుకుంటున్న క్రమంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవన్నీ. కాబట్టి వదులు దుస్తులతో లావుగా కనబడతారన్న బిడియం అసలే వద్దు లోదుస్తులు తరచుగా మార్చాలి. కొందరికి సింథటిక్ అలర్జీ ఉంటుంది. దానిని గమనించి కాటన్ లేదా మెత్తని ఫ్యాబ్రిక్ లోదుస్తులైనా వాడాలి ఈ సమయంలో పాదాలు, మడమల మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి హైహీల్స్ మానేసి ఫ్లాట్ గా, మెత్తగా, పాదానికి అనువుగా ఉండే పాదరక్షలను వాడాలి ప్లెయిన్ టాప్ వేసుకుంటే దేహంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రింట్స్ ఉన్న టాప్, సైడ్స్ ప్యాచ్ అటాచ్ చేసినవి అయితే చూపరుల దృష్టి డిజైన్ మీద పడుతుంది.



Click it and Unblock the Notifications