Latest Updates
-
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్!
శరీర బరువును తగ్గించే సహజమైన చిట్కాలు...!

జిమ్ కి వెళ్లి నానా తంటాలు పడి ఫ్యాట్ బర్న్ గి చేయాలను కొంటారు. అయితే అందువల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కొవ్వును కరిగించడం జరుగుతుంది. అయితే దాని వల్ల శరీరంలో ఒకే సారి కొన్ని జీవక్రియలపై ప్రభావం చూపెడుతుంది. శరీరంలోని మినరల్స్ తగ్గిపోతాయి. శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి జిమ్ కు వెళ్ళకుండానే జీర్ణక్రియ ద్వారా మీ శరీర సామర్థాన్ని పెంచుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వ్యాయామంతోపాటు..పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది.
నీళ్ళు: సాధారణంగా డ్రింక్స్ అంటే మీరు ఎక్కువగా పంచదార కలపిన జ్యూసులు, సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల పూర్తిగా వాటి మీద ఆధారపడుతారు. దాంతో శరీరంలో అధనంగా మరి కొంత కొవ్వు ఏర్పడుతుంది. అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా సేవించడం మంచిది. నీరు తాగడము వల్ల సైడు ఎఫెక్ట్సు ఉండవు . ఎక్కువగా తాగితే మూత్రపిండాలకు శ్రమ ఎక్కువవుతుంది. తక్తం లొని సోడియం నిల్వలు పల్చబడతాయి. అందువలన ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు . దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు .శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము . చాలా మందికి తెలియకునా నీరు , నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు . శరీరము లొ రక్తం కి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది . మానవ శరీరము లోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి , విటమిన్లు , మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడం లో నీరు భూమిక వహిస్తుంది . నీటిలో క్లోరిన్ , ఇయోడి్న్ , ఆక్షిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు .
గ్రీన్ టీ: అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమ కాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ (తేయాకు). అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది.
తేనె: పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
మొలకెత్తిన పెసలు: వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ లో బనానా(అరటిపండు)తప్పని సరి: ప్రతిరోజూ ఉదయం తీసుకొనే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినడం చాలా మంచిది. డైట్ లో ఐరన్ కంటెంట్ తప్పనిసరి: ఫ్యాట్ బర్నింగ్ టిప్స్ లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.



Click it and Unblock the Notifications
