Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నల్లబడుతున్నచర్మంను కాంతివంతంగా మార్చే హోం రెమెడీస్
సన్ టాన్ ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం నల్లబడుతుంది. దీన్నే సన్ టాన్ అంటారు. రోజంతా బయట తిరగడం వల్ల సూర్యరశ్మిలోని హానికరమైన యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల, దానికి తోడు వాతావరణంలో కాలుష్యం, దుమ్ముధూళి చర్మం మీద పడటం వల్ల మన చర్మం నల్లబడుతుంటుంది. ముఖ్యంగా బయటకు బహిర్గితమయ్యే, ముఖం, చేతులు, కాళ్ళు త్వరగా టానింగ్ కు గురి అవుతుంటాయి. దానికి తోడు సరిగా చేతులను శుభ్రం చేసుకోకపోవడం, శుభ్రతలో నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా చేతులు నల్లబడుతుంటాయి. దాంతో చర్మం యొక్క ఒరిజినల్ కలర్ మరియు బ్యూటి తగ్గిపోతుంది.
ఇక్కడ ప్రశ్నఏంటంటే..సన్ టాన్ ను పూర్తిగా నివారించడం సాధ్యం అవుతుందా?ఈ ప్రశ్నకు సమాధానంగా మహిళలందరికీ ఒక శుభవార్త. ఒక్క ప్రదేశంలో టాన్ కు గురి అయితే, దానికి వివిధ రకాల కారణాలుంటాయి. అటువంటి వారు కూడా ఈ క్రింది తెలిపిన చిట్కాలను అనుసరిస్తే తప్పనిసరిగా టానింగ్ నుండి విముక్తి పొందవచ్చు.

బేకింగ్ సోడ
ముందుగా బేకింగ్ సోడను నీళ్ళలో వేసి మిక్స్ చేయడం లేదా పేస్ట్ లా చేసుకోవచ్చు టాన్ కు గురైన ప్రదేశంలో ఈ పేస్ట్ ను కానీ లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిని కానీ మిక్స్ చేయాలి. త్వరగా ఫలితం చూడాలనుకుంటే, రోజు విడిచి రోజు అప్లై చేయండి.

వెనిగర్
వెనిగర్ మరియు నీళ్ళను సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత మీ చేతులను అందులో డిప్ చేసి 5-10నిముషాలు అలాగే ఆనీటిలో ఉంచాలి. 10నిముషాల తర్వాత చేతులను బయటకు తీసి చల్లటి నీటితో మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ థెరఫీని రెగ్యులర్ గా చేయవచ్చు.

తేనె మరియు నిమ్మరసం
తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేసి, టాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాటన్ టవల్ తో తేమను పూర్తిగా తుడుచుకోవాలి.

కీరదోసకాయ రసం
నిమ్మరసం మరియు కీరదోసకాయ రసం మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి, చర్మం నల్లగా మారిన ప్రదేశంలో అప్లై చేయాలి. అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల సన్ టాన్, స్కిన్ రాషెస్, మరియు సన్ బర్న్ నుండి విముక్తి పొందవచ్చు.

నిమ్మరసం
నిమ్మరసంలో కాటన్ బాల్స్ లేదా పత్తిని ముంచి టాన్ గురైన ప్రదేశంలో తుడవాలి. 5నిముషాలు మసాజ్ చేసి 10-15నిముషాలు అలాగే ఉంచాలి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీ చేతులను చల్లటి నీటితో కడుక్కోవాలి.

శెనగపిండి
శెనగపిండి, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను టానింగ్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 10నిముషాలు అలాగే ఉంచాలి. మొత్తం మిశ్రం ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు
నిమ్మరసం మరియు పచ్చిపాల్లో కొద్దిగా పసుపు కలిపి బాగా మిక్స్ చేసి తర్వాత టానింగ్ ఏరియాలో అప్లై చేసి 10 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నీళ్ళ
తరచూ మీరు కొబ్బరి నీళ్ళను చేతులకు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్ళు టానింగ్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి, రోజులు ఒకటి రెండు సార్లు అప్లై చేయవచ్చు.

బొప్పాయి:
బొప్పాయి గుజ్జు మరో ఎఫెక్టివ్ పదార్థం. ఇది టానింగ్ ను త్వరగా తొలగించడానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును టానింగ్ ఏరియాలో అప్లై చేసి 10 నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత 10-15నిముషాలు పాటు అలాగే ఉంచిత తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముల్తానీ మట్టి
వైట్ గార్డ్ మరియు ముల్తానీ మట్టిని మిక్స్ చేసి సన్ టాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications