Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
చలికాలంలో పాదాల సంరక్షణకోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు
చలికాలం కాస్త గిలి..గిలిగా ఉన్నా.. ఎన్నో చర్మ సమస్యలనే కలిగిస్తుంది. ఈ కాలంలో చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. పాదాలు పగలటమేంటీ ఇది ఒక్క ఆడవారి సమస్య అని అనుకుంటున్నారా
చలికాలం కాస్త గిలి..గిలిగా ఉన్నా.. ఎన్నో చర్మ సమస్యలనే కలిగిస్తుంది. ఈ కాలంలో చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. పాదాలు పగలటమేంటీ ఇది ఒక్క ఆడవారి సమస్య అని అనుకుంటున్నారా? కానేకాదు. ఈ సమస్య ఈ కాలంలో అందరినీ పట్టి పీడిస్తుంది.
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.
2. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
3. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
4. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
5. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.
6. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.
7. ఇవి చేయకూడదు :
చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.
8. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.
9. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు.



Click it and Unblock the Notifications
