Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఆలివ్ ఆయిల్ స్కిన్ టోన్(ఛామన ఛాయ)గల వారికి నప్పే కలర్స్
మీ చర్మం గోధుమ వర్ణంలో వుంటే మీరు అదృష్ట వంతులే. అన్ని రకాల చర్మ వర్ణాల్లోకి గోధుమ వన్నె ఛాయ చాలా విలాసవంతంగా, అందంగా వుంటుంది. గోధుమ వన్నె మేని చాయ వుండే వారికి చాలా ముదురు రంగు జుట్టు లేదా గోధుమ రంగు జుట్టు తో పాటు తేనె రంగు లేక గోధుమ వర్ణపు కళ్ళు వుంటాయి. నిస్సందేహంగా మీరు గదిలోకి నడిచి వస్తుంటే తలలు మీ వైపు తిరుగుతాయి. అయితే మీకు గోధుమ మేని ఛాయ ఉన్నట్లయితే, దానికి మరింత వన్నె తెచ్చే రంగుల దుస్తులు మీరు వేసుకోవాలి. మీ గోధుమ వన్నె మేనికి సరిపోయే 10 అందమైన రంగుల గురించి తెలుసుకోవడానికి ఇది చదవండి.

1. తెలుపు :
గోధుమ వన్నె చర్మం గలవారు తమ అందమైన చర్మాన్ని ప్రదర్శించాలనుకుంటే తప్పేముంది. మరి గోధుమ మేని చాయను ప్రస్ఫుటంగా చూపాలంటే తెల్లటి షర్టు లేదా డ్రస్ కన్నా చక్కటిది ఏముంటుంది. తెలుపు మీ మేని చాయను ముదురు వర్ణంలో, గొప్పగా చూపిస్తుంది.

2. మెరూన్:
గోధుమ వర్ణపు చర్మం వారికి సరిపోయే మరో అందమైన రంగు తోపు రంగు - ముఖ్యంగా శీతాకాలం లో ముదురు ఎరుపు లేదా తోపు రంగు బాగుంటుంది. ఓ హాలిడే పార్టీ లో గానీ లేక ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో గానీ తోపు లో షేడ్స్ మీకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేలా నిగారింపు తెస్తాయి.

3. గులాబీ
గోధుమ మేని చాయ గల స్త్రీ పురుషులు తమ దుస్తులకు ఊపు, ఉత్సాహం తెప్పించాలంటే తప్పని సరిగా పింక్ షర్టు గానీ, బ్లౌస్ లేదా డ్రస్ కానీ వస్తువులు కానీ కొనాల్సిందే. గులాబీ రంగు ఉత్సాహం తెప్పిస్తుంది, కొంత సెక్సప్పీల్ జోడిస్తుంది, అదీ వేసవి కాలంలో అయితే మరింత ప్రత్యేకంగా.

4. ఆకుపచ్చ
ఆకుపచ్చ దుస్తులు, అదీ ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులైతే, గోధుమ వన్నె మేని ఛాయ గలవారికి ఎంత మంచి ఎంపికో చాలా మందికి తెలియదు. అయితే ముదురాకుపచ్చ రంగు మీ కళ్ళు, జుట్టు నేపథ్యంలో చాలా చక్కగా వుంటుంది. పొడవాటి శిరోజాలు వున్న స్త్రీలయితే ముదురాకుపచ్చ జాకెట్ మీదుగా తమ జడను అలా వదిలేస్తో ఎంత బాగుంటుందో!

5. పసుపు
గోధుమ వర్ణపు శరీరం గల స్త్రీ పురుషుల మేని చాయలో కొంత పసుపు వర్ణం కూడా దాగి వుంటుంది. అందువల్ల ఒక పసుపు రంగు చొక్కానో, టై గానీ లేదా జడకు కట్టే పరికరాలు గానీ ఈ హాయైన రంగులను పైకి తెస్తాయి. పసుపు రంగు దుస్తులు ఎప్పుడైనా వాడవచ్చు, కానీ ఎండ కాసే రోజుల్లో మరీ బాగుంటుంది.

6. నలుపు
నలుపు రంగు దుస్తులు ఎవరికైనా బాగుంటాయి - అలా అని గోధుమ వర్ణపు శరీర ఛాయ వున్న వారు నల్ల రంగు దుస్తులు వాడవద్దని కాదు. ఈ మేని చాయలో వున్న వారి కళ్ళలోని నలుపును మరింత గాఢ తరం చేస్తాయి నల్లటి దుస్తులు, దాంతో మీ రంగులోని సహజ చాయలు నిగారిస్తాయి.

7. ముదురు నీలం
గోధుమ మేని ఛాయ గల స్త్రీ పురుషులకు ముదురు రంగులు చాలా బాగుంటాయి, అదీ శీతాకాలంలో అయితే మరింత ప్రత్యేకంగా. శీతాకాల సాయంత్రాల్లో ఓ పార్టీ కి గాని వెళ్తుంటే ఓ నీలం రంగు స్వెట్టర్ లేదా ఈవెనింగ్ డ్రెస్ వేసుకుని వెళ్తే మీ మేని ఛాయ ఆకర్షణీయంగా కనపడుతుంది.

8. ఊదా రంగు
ఊదా రంగు రాజరికపు వర్ణం అని మీకు తెలుసా? అవును, పూర్వ కాలంలో రాజులు, రాణులు ఈ రంగు దుస్తులు ధరించడ౦ వల్ల వారు పాలకులన్న భావన కలిగేది. అలాగే తమ వ్యక్తిగత సౌందర్యానికి సారధ్యం వహించాలనుకునే గోధుమ వర్ణం వారు తప్పని సరిగా తమ దుస్తుల్లో ఊదా రంగువి ఉండేలా చూసుకోవాలి. గోధుమ వన్నె చాయకు మరింత నిగారింపు తెచ్చే రంగిది.

9. గోధుమ
ఒక్కోసారి ఒక వస్తువుకు గుర్తింపు తేవాలంటే దాని పక్కనే చాలా విభిన్నమైన దానిని ఉంచాలి. అందువల్లే గోధుమ వర్ణపు స్త్రీ పురుషులు తెలుపు రంగు దుస్తుల్లో చాలా మెరుస్తుంటారు. కొన్ని సార్లు దానిని పోలిన దానినే జత చేయడం వల్ల కూడా కంటికింపుగా వుంటుంది. మీ మేని ఛాయ గోధుమ వర్ణానికి దగ్గరగా వుంటే, మీరు బ్రౌన్ స్వెట్టర్, హాట్ లేదా బ్లౌస్ ధరించి దానిని మరింత మెరిసేలా చేయండి.

10. ఆవపిండి రంగు
గోధుమ వర్ణం వారికి పనికి వచ్చే రంగుల జాబితాలో చివరిది చాలా చక్కటి రంగు - ముదురు పసుపు (లేదా ఆవపిండి రంగు) - దుస్తుల్లో గానీ లేదా ఇతర వస్తువుల్లో గానీ. పసుపు, గోధుమ, పచ్చ వర్ణాలతో కలిసి ఆవపిండి రంగు ఈ వన్నె చర్మం గలవారికి చాలా ఆప్షన్స్ ఇస్తుంది. దీంతో ఏడాది లోని ఏ సమయంలో అయినా మీ మేని చాయలోని సహజ వర్ణాలు మెరుస్తాయి.



Click it and Unblock the Notifications
