వాల్ నట్స్(అక్రోట్లు)లో ఉండే సకల సౌందర్య రహస్యాలు

By Super

వాల్ నట్స్(అక్రోట్లు)పై పొట్టు తొలగించినప్పుడు, లోపలి ఉన్న విత్తనం చూస్తే అచ్చం బ్రెయిన్ ఆకారంను కలిగి ఉండటం చూస్తే, ఆశ్చర్యం కలగకమానదు. అనుకోకుండా ఇలా ఉండం చాలా ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు, బ్రెయిన్ ఆకారంలో ఉండే ఈ గింజలు, డ్రైఫ్రూట్స్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. walnut ని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము . వాల్ నట్ శాస్త్రీయ నామము " జుగ్లాన్స్ రెజియా (jugulans Regia) అంటారు . ఇందులో ఎన్నో రకాల జాతులు (species) ఉన్నాయి. వయసు తో పాటు కొన్నీ శారీరక రుగ్మతలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి . వాటిని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదపులో ఉండి జీవితతం సాఫీగా సాగిపోతుంది. పౌష్టికాహారపదార్ధములలో వాల్ నట్స్ (అక్రోట్ కాయల గింజలు) వలన ఎన్నో ప్రయోజనాలు కలవని నిర్ధారణ అయినది. ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి ఇలా ఫ్రూట్, డ్రైనట్ లోని ప్రయోజనాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

మరి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ బ్యూటీ మీద ఏవిధంగా ప్రభావితం చేస్తుందో ఈ క్రింది విధంగా తెలుసుకోండి....

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది

వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇదిచర్మం యొక్క పునరుత్పత్తిని మరియు స్థితిస్తాపకతను ప్రోత్సహిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు సెల్ డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది, ఇంకా, స్కిన్ టోన్ మెరుగుపరచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా, చర్మం ప్రకాశంతంగా కనబడేలా చేస్తుంది. ముఖంలో చారలు, ముడుతలు లేదా స్పాట్స్ వంటి వాటిని నివారించుకోవడానికి వాల్ నట్స్(అక్రోట్స్)ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలి.

స్వచ్చమైన మరియు ప్రకాశించే చర్మం

స్వచ్చమైన మరియు ప్రకాశించే చర్మం

వాల్ నట్స్ లో కెమికల్ లక్షణాలున్నాయి, ఇవి శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతాయి, అందువల్ల శరీరంలో ప్రతి ఒక్క కణానికి, కణజాలనిక ఆక్సిజెన్ మరియు న్యూట్రీషియన్ ను సరఫరా చేస్తుంది. ఇది రక్తప్రసరణకు బాగా సహాయపడుతుంది . దాంతో చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుండాటానికి సహాయపడుతుంది . ఒక రోజులో స్నాక్స్ సమయంలో మూడు, నాలుగు వాల్ నట్స్ తింటే, మీ చర్మం హెల్తీగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

స్కిన్ ఇన్ఫెక్షన్ నివారించే వాల్ నట్ ఆయిల్

స్కిన్ ఇన్ఫెక్షన్ నివారించే వాల్ నట్ ఆయిల్

చర్మం అందంగా మరియు ప్రకాశవంతంగా మార్చడంలో వాల్ నట్ డ్రై ఫ్రూట్ చాలా సహాయపడుతుంది. వాల్ నట్ లో ఉండే ఆయిల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. వాల్ నట్ ఆయిల్లో, యాంటీ ఫంగాల్ , యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అథ్లెటిస్ వారి పాదు, పోరియాసిస్ మరియు కాండిడ వంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను చాలా గ్రేట్ గా నివారిస్తాయి. వెల్లుల్లి వంటి యాంటీ ఫంగల్ పదార్థాలతో మిక్స్ చేసి, అప్లై చేయడం వల్ల గాయాలను త్వరగా నయం చేస్తాయి.

మంచి స్కిన్ స్ట్రక్చర్

మంచి స్కిన్ స్ట్రక్చర్

వృద్ధాప్యంతో పోరాడటం మాత్రమే కాదు, మీ చర్మంను కాంతివంతగా మార్చడంలో వాల్ నట్స్ మొత్తం చర్మం ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, స్కిన్ డ్యామేజ్ ను ఎదుర్కొంటాయి. వీటితో పాటు, వాల్ నట్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ సెల్స్ ను బలోపేతం చేస్తాయి, చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. మరియుచర్మంలోని మలినాలను తొలగిస్తాయి. మరియు ఈ నట్స్ లో ఉండే ప్రోటీనులు ఎముకలను బలోపేతం చేస్తాయి . కొలెజాన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తాయి.

అందమైన మరియు స్ట్రాంగ్ హెయిర్

అందమైన మరియు స్ట్రాంగ్ హెయిర్

వాల్ నట్ ఆయిల్ ను ఒక సుగంధ భరిత నూనెవలే అనేక హెయిర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్ జుట్టును బ్లాక్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతాయి . ఎందుకంటే వాల్ నట్ లో ఉండే బయోటిన్, న్యూట్రీషియన్స్ హెయిర్ ను స్ట్రాంగ్ గా మరియు వాల్యూమినస్ గా చేస్తాయి . వాల్ నట్ లో ఇంకా ప్రోటీనులు హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి . వాల్ నట్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మారుతాయి.

ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి

ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి

అవును, వాల్ నట్ మూడ్ ను పెంచుతుంది. ఎందుకంటే, ఇందులో విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మూడ్ ను పెంచుతుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అలసట, ఆందోళన మరయు నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ ను చేర్చుకోవాలి, టెన్షన్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు. ఎందుకంటే నిద్రలేమి వల్ల కళ్ళక్రింది ఉబ్బు, ముడుతలు మరియు బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

గర్భధారణ సమయంలో మంచిది

గర్భధారణ సమయంలో మంచిది

వాల్ నట్స్ లో విటమిన్ బి కాంప్లెక్స్ మూలాలు ఉండటం వల్ల ఇవి మన శరీరానికి అవసరం అయ్యే ఫొల్లెట్, రిబోఫ్లెవిన్, థయమిన్ మరియు ఇతర అంశాలను కూడా అందిస్తుంది. వాల్ నట్స్ లో మెగ్నీషియం, ప్రోటీనులు, హెల్తీ ఫైబర్, మరియు ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉండటం వల్ల గర్భిణీ మహిళలకు చాలా మేలు చేస్తుంది. అలాగే కడుపులో బిడ్డకు కూడా మేలు చేస్తుంది . ఇంకా వాల్ నట్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యానికి మరియు అందానికి మంచిది.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గిస్తుంది

అన్ని రకాలుగాను ఉపయోగపడే వాల్ నట్, చర్మానికి ఒక రూపును, వ్యాధినిరోధకతను పెంచడం మాత్రమేకాదు, ఇది బరువు తగ్గించుటలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ కంటెంట్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ వల్ల ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇది శరీరంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది.

బ్రెయిన్ హెల్త్

బ్రెయిన్ హెల్త్

మెదడు సామర్థ్యాన్ని,జ్ఝాపక శక్తిని పెంచి మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది . మతిమరపును నివారిస్తుంది . మరి బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే, ప్రతి రోజూ కొన్ని వాల్ నట్స్ ను తీసుకోవడం ఉత్తమం . వాల్ నట్స్ ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ ను రక్తంకు సరఫరా చేయడంతో శరీరం అంతా ప్రసరణ జరుగుతుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది

వ్యాధినిరోధకత పెంచుతుంది

వాల్ నట్స్ లో మంచి ఫ్యాట్, విటమిన్స్, ప్రోటీనులు మరియు ఇతర న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . మీలో వ్యాధినిరోధకతను పెంచడంలో, మొత్త శరీరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వాల్ నట్స్ హార్ట్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలు పనిచేసే సామర్థ్యాన్ని పెంచతుంది . వాల్ నట్ చర్మం క్లియర్ గా మార్చుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

Desktop Bottom Promotion