Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
నోటి చుట్టూ చర్మం నల్లగా రింగ్ లా కనబడుటను నివారించడానికి ఉత్తమ చిట్కాలు
సాధారణంగా మన చుట్టూ ఉన్న వారిని గమనించినట్లైతే ముఖం చాలా అందంగా ఉంటుంది. అయితే అందంగా కనిపించే ముఖంలో కూడా లోపం కనిపిస్తుంది. నోటి వద్ద(మూతి చుట్టి)నల్లగా కనబడుతుంది. ముఖం పైభాగంలో నల్లగా మరియు క్రింది భాగంలో మాతం చర్మం రంగులో మార్పును మీరు గమనిస్తారు. ఈ మార్పుకు కారణం స్కిన్ పిగ్మెంటేషన్ లేదా వాతావరణంలో కలిగే మార్పులు వల్ల పెదాల చుట్టూ బ్లాక్ గా కనిపిస్తుంది. అందువల్ల, కొంత మంది తరచూ పెదాలను మరియు పెదాల చుట్టూ తడుపుతుంటారు. లాలాజంలో చర్మంను నల్లగా మార్చే లక్షణాలుండటం వల్ల పెదాల చుట్టు చర్మం నల్లగా మారుతుంది.
ఇలా సమస్యను ఎదుర్కొంటున్నవారికి లక్కీగా కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించి నోటి చుట్టూ ఉన్న డార్క్ రింగ్ ను తొలగించుకోవచ్చు . డార్క్ స్పాట్స్ ను నివారించే హోం రెమెడీస్ లో టమోటో కూడా ఒకటి. టమోటోను స్లైస్ గా కట్ చేసి, మూతి చుట్టును మర్దన చేయడం వల్ల చర్మంను తెల్లగా మార్చుతుంది . సరైన సమయంలో తీసుకొనే జాగ్రత్తలు వెంటనే ఫలితాలను అందిస్తాయి. మూతి చుట్టూ నల్లగా రింగ్ లా ఏర్పడ్డ చర్మం యొక్క రంగును మార్చుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. మరో గుర్తుంచుకోవల్సిన విషయం హోం రెమెడీస్ ను ఉపయోగించేటప్పుడు, ఇతర రసాయనిక ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు. ఇది మీ చర్మం సున్నితంగా ఉండటం వల్ల చర్మం మీద చెడు ప్రభావం చూపుతుంది. READ MORE: డార్క్ లిప్స్ నివారించే టాప్ 10 అత్యుత్తమ చిట్కాలు
నోటి చుట్టు అస్యహ్యంగా కనిపించే డార్క్ స్కిన్ తొలగించుకోవడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాయి . అయితే ఈ హో రెమెడీస్ ను ప్రయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం వల్ల మీ సెన్సిటివ్ స్కిన్ కు ఏలాంటి హాని జరగకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవచ్చు. నోటి చుట్టూ లేదా ముఖంలో డార్క్ ప్యాచ్ ను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు గ్రేట్ గా సహాయపడుతాయి. మరి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...READ MORE:నల్లగా ఉన్నారా..మీరు ఫెయిర్ గా మారే నేచురల్ పద్దతులు

తేనె మరియు నిమ్మరసం:
ఒక నిమ్మకాయయొక్క రసాన్ని మరియు ఒక చెంచా తేనె తీసుకొని, రెండింటిని బాగా మిక్స్ చేసి తర్వాత బ్లాక్ ప్యాచ్ ఉన్న ప్రదేశంలో నోటి చూట్టూ ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

టమోటో జ్యూస్:
టమోటో రసంలో బ్లీచింగ్ ఏజెంట్స్ పుష్లకంగా ఉంటాయి. ఇది ముఖంలో డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. టమోటో రసాన్ని నోటి చూట్టూ అప్లై చేయాలి. ఎండిన తర్వాత మరో సారి టమోటో తొక్కతో మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప ఉత్తమమైనది:
మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటే, పొటాటో స్కిన్ ఉపయోగించడానికి ప్రయత్నించండి. బంగాలదుంపను స్లైస్ గా కట్ చేసి బ్లాక్ గా ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసి కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ మిక్స్ :
అరకప్పు పాలలో 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ మిక్స్ చేసి చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని డార్క్ గా ఉన్న చర్మం మీద మాస్క్ లా వేసుకోవాలి . ఇది నోటి చుట్టూ ఉన్న డార్క్ రింగ్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

బాదం ఆయిల్ :
బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆయిల్ తో చర్మంను సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది.

పెరుగు:
నోటి చుట్టూ ఉన్న డార్క్ స్కిన్ తొలగించుకోవడానికి పెరుగును ఉపయోగించాలి. ఈ హోం రెమెడీ ఎవర్ గ్రీన్ హోం రెమెడీ . ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కలవారికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరియు చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది.

మిల్క్ క్రీమ్:
ముఖం మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ నివారించడానికి మిల్క్ క్రీమ్ ఒక ఎఫెక్టివ్ హోం రెమెడి పాలలో ఒక చెంచా పెరుగును చేర్చి మిక్స్ చేసి పేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ కాంబినేషన్ ప్యాక్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.

గ్రీన్ పీస్:
గుప్పెడు పచ్చిబఠానీలను శుభ్రంగా కడిగి తడి ఆరనివ్వాలి. తర్వాత వీటిని పౌడర్ గా లేదా పేస్ట్ గా తయారుచేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే తేలిక పరుస్తుంది.

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఆలివ్ ఆయిల్ ను బ్లాక్ గా ఉన్న చర్మ మీద అప్లై చేయాలి.

ఎగ్ మాస్క్ :
ఎగ్ మాస్క్ ను చర్మం మీద వేసుకోవడం వల్ల . ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మంను తెల్లగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

చర్మంను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:
నెకొకసారి మీ నోటి చుట్టూ ఉన్న చర్మంను ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల నేచురల్ హోం మేడ్ స్ర్కబ్ గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ నివారిస్తుంది.

నిమ్మ మరియు పంచదార:
నిమ్మ మరియు పంచదార మిశ్రమంను తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా బంకగా ఉంటుంది. ఈ మిశ్రామన్ని నోటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా వారానికొకకసారి చేస్తుంటే. డార్క్ స్కిన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

శెనగపిండి:
ఒక చెంచా శెనగపిండిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయాలి . ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి . అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు:
పసుపును వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మంను తేల్లగా పరచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపులో చర్మాన్ని సాఫ్ట్ గా మార్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

కీరదోసకాయ:
కీరదోసకాయ మరో ఉత్తమ హోం రెమెడీ . డార్క్ స్పాట్స్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు . అయితే ఈ హోం రెమెడీ వల్ల ఫలితాలు కొంచెం నిధానంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications