Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
పైపెదవిపై అన్ వాంటెడ్ హెయిర్ తొలగించే పర్ఫెక్ట్ హోం రెమిడీస్..!
అమ్మాయిల్లో ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. చేతులు, పెదాలు, ముక్కు, గడ్డం, కొంతమందికి ముఖమంతా అవాంఛిత రోమాలు ఇబ్బందిపెడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు అమ్మాయిల్లో నీరసాన్నిస్తాయి. ఎంత తొలగించుకున్నా తాత్కాలిక ఫలితాన్నిస్తాయి కానీ.. పూర్తీగా క్లియర్ చేయలేవు.
ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే అవాంఛిత రోమాలు పోవడానికి లేజర్ చికిత్సలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడొచ్చు.
అయితే పైపెదవిపై ఇబ్బందిపెట్టే అన్ వాంటెడ్ హెయిర్ తొలగించుకోవడానికి రకరకాల క్రీములు అందుబాdటులో ఉంటాయి. కానీ.. పైపెదవిపై అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి అన్ వాంటెడ్ హెయిర్ తొలగించే సింపుల్ హోం మేడ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం..

బంగాళదుంప
బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కోసి పసుపుధాన్యాలతో కలిపి మెత్తగా రుబ్బాలి. రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. రెండు, మూడు వారాల పాటు ఇలా చేస్తే సమస్య దూరమవుతుంది.

నిమ్మరసం, తేనె
రెండుచెంచాలా తేనెలో కొద్దిగానిమ్మరసం మిక్స్ చేసి, కాటన్ బాల్స్ తో రోమాలు పెరిగేదిశలో నిమ్మరసం తేనె మిశ్రమాన్నినేరుగా అప్లై చేయాలి. ఇది తడి పూర్తిగా ఆరిన తర్వాత గోరువు వెచ్చనినీటితో శుభ్రం చేసుకుంటే, ఒక్క రోజులో ఫలితం మీరు గమనించవచ్చు.

ఎగ్ వైట్
గుడ్డు తెల్లసొనలో కొంచెం మొక్కజొన్న పిండి, పంచదార కలిపి పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే నెలరోజుల్లో పెదవి మీద రోమాల పెరుగుదల తగ్గిపోతుంది.

పసుపు
పసుపులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

పంచదార
నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత దూదితో అవాంఛిత రోమాలపై రాసుకుని గుండ్రంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా కడగాలి. లేదా పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించి వాక్సింగ్ లా కూడా వాడుకోవచ్చు.

పాలు
ఒక స్పూన్ పాలలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పైపెదవిపై రాసి ఆరిన తర్వాత నెమ్మదిగా రుద్ది చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

శెనగపిండి
శెనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తుండడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

అరటిపండు
అరటిపండును గుజ్టుగా చేసి అందులో రెండు టీస్పూన్ల ఓట్‌మీల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా రుద్దాలి. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా చేశాక 20 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే అవాంఛితరోమాలు పోవడమే కాకుండా చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.

పెరుగు, శెనగపిండి
ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను పై పెదవి మీద రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గోధుమపిండి
గోధుమపిండిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను పైపెదవి మీద రాసి పావుగంట తర్వాత నెమ్మదిగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తుంటే సహజంగానే అవాంఛితరోమాలను తొలగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
