Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
అందమైన చర్మం, ఒత్తైన జుట్టు అందించే ట్రెడిషనల్ బ్యూటీ సీక్రెట్స్..
మా అమ్మ జుట్టు, మా అమ్మమ్మ జుట్టు ఎంత అందంగా ఉంటుందో. వాళ్లు జుట్టు ఇప్పటికీ స్ట్రాంగ్ గా, నల్లగా ఉంటుంది అని డీలా పడిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే వాళ్ల చర్మం కూడా ఎంతో స్మూత్ గా మెరిసిపోతూ ఉంటుందని జెలసీ ఫీలయ్యే కూతుళ్లు ఉన్నారు. అయితే బ్యూటీ పార్లర్లు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోయినా.. వాళ్లకు మాత్రం జుట్టు, చర్మం చాలా అందంగా ఉండేది. మరి వాళ్ల సౌందర్య రహస్యమేంటి ?
సింపుల్.. వాళ్లు ఫాలో అయ్యే చక్కటి సింపుల్ హోం రెమిడీసే వాళ్ల బ్యూటీ సీక్రెట్స్. కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా.. ఇంట్లోని వస్తువులే ఉపయోగించేవాళ్లు. అందుకే.. వాళ్లు అంత హెల్తీ, అందంగా కనిపించేవాళ్లు. అలాగే వాళ్లు తీసుకునే హెల్తీ ఫుడ్, సమయానికి నిద్ర, ఆహారం వంటి నియమాటు పాటించడం వల్ల వాళ్ల జుట్టు, చర్మం రెండూ బ్యూటిఫుల్ గా ఉండేవి. మరి వాళ్లు చెబుతున్న బ్యూటీ సీక్రెట్స్ మీరూ ఫాలో అవ్వాలని ఆసక్తి చూపిస్తున్నారా ? అయితే ఫాలో అయిపోండి..

మెరిసే చర్మానికి
శనగపిండి, పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాల మీగడ కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. దీనివల్ల చర్మానికి రకరకాల ప్రయోజనాలతోపాటు, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ప్యాక్ 2
ఆరంజ్ తొక్క, పెసర పిండి, కొద్దిగా తేనె, పెరుగు కలపాలి. అన్నింటినీ మిక్స్ చేసి ముఖానికి పట్టించుకుంటే.. చర్మంలో కొత్త నిగారింపు వస్తుంది.

ఒత్తైన జుట్టుకి
ఆలివ్ ఆయిల్ లో కొన్ని చుక్కల తేనె కలపాలి. దాన్ని జుట్టుకి బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాలు.. ఒత్తుగా పెరుగుతుంది.

హెయిర్ ప్యాక్ 2
కొద్దిగా పెరుగు తీసుకుని, ఎగ్ వైట్ కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ రెగ్యులర్ గా ఉపయోగిస్తే.. జుట్టు షైనీగా, సిల్కీగా ఉంటుంది.

పగిలిన పాదాలకు
రఫ్ గా మారిన చేతులు, పగిన పాదాలతో బాధపడుతుంటే.. తేనె వ్యాక్స్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెట్రోలియం జెల్లీని రాత్రి నిద్రపోవడానికి ముందు అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. లేదా పంచదార, తేనె స్క్రబ్ ఉపయోగించినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

చుండ్రు
చుండ్రు సమస్యతో బాధపడుతుంటే.. రాత్రంతా మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసి జుట్టుకి, స్కాల్ప్ కి అప్లై చేయాలి. కొన్ని గంటల తర్వాత షీకాకాయ లేదా షాంపూతో శుభ్రం చేసుకుంటే.. చుండ్రు నివారించవచ్చు.

చుండ్రు
తెల్ల మిరియాలకు పెరుగు మిక్స్ చేసి స్కాల్ప్ కి అప్లై చేయాలి. పెరుగు యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండటం వల్ల.. జుట్టు, చర్మ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు.

మొటిమలకు
కొద్దిగా పసుపు తీసుకుని కొన్ని చుక్కల నీళ్లు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమలపై రాయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మొటిమలకు ముల్తానీ మట్టి
కొద్దిగా ముల్తానీ మట్టి తీసుకుని.. రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications