Latest Updates
-
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
సాధారణంగా అమ్మాయిలకు డెలవరీ టైంలో పొట్టమీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కాకుండా, బరువు తగ్గిన తర్వాత అమ్మాయి, అబ్బాయిలందరిలోను నడుము చుట్టూ, భుజాల చుట్టూ హిప్స్ మీద స్ట్రెచ్ మార్స్క్ వచ్చే అవకాశం వుంది.
సాధారణంగా అమ్మాయిలకు డెలవరీ టైంలో పొట్టమీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కాకుండా, బరువు తగ్గిన తర్వాత అమ్మాయి, అబ్బాయిలందరిలోను నడుము చుట్టూ, భుజాల చుట్టూ హిప్స్ మీద స్ట్రెచ్ మార్స్క్ వచ్చే అవకాశం వుంది. ఈ పరిస్థితిలో చర్మం కింద కొల్లాజున్ ఫైబర్స్ సాగిపోయి విడిపోవడం వల్ల నడుము మీద, భుజాల చుట్టూ ఏర్పడే తెల్లని పొడవైన చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు.
కొందరు స్ర్తీలలో తొలి యవ్వన దశలో అంటే రజస్వల అయిన అనంతరం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు గర్భం ధరించినప్పటి నుంచి బలమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా ఉండటం, బిడ్డపుట్టిన తర్వాత కూడా అదేవిధమైన జీవన శైలికి అలవాటు పడటం వల్ల పొట్ట బాగా సాగి, ముడతలు పడుతుంది. ఈ విధంగా ఒక్క గర్భిణులకే కాదు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఏ విధమైన ఎక్సర్‌సైజూ చేయకుండా, ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉండే ప్రతి ఒక్కరికీ ఆ విధంగా ముడతలు పడటం సహజం.

వీరికే కాదు, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలోనూ, అధికంగా ఎక్సర్‌సైజులు చేసేవారిలోనూ కూడా ఈ విధంగా చర్మం బాగా సాగి, చారికలు పడతాయి. అయితే అవి కొంతకాలానికి అంటే మామూలుగా రోజూవారీ పనులు చేసుకుంటూ, ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేట్టు చూసుకుంటూ, సహజ పద్ధతిలో బరువు తగ్గితే నెమ్మదిగా చర్మంలో కలిసిపోతాయి. కొద్దిమందిలో మాత్రం ఆ విధంగా కలవకుండా మచ్చల్లాగా, చారికల్లాగా ఏర్పడతాయి. మరి అటువంటి వారు కూడా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ను అతి సులభంగా పోగొట్టవచ్చు.

1. ఆముదం:
ఆముదంలో ఓమేగా 6 మరియు ఓమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ , మరియు ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. ఆముదం నూనె చర్మంలోకి పూర్తిగా చొచ్చుకుని పోయి, స్కిన్ రీజనరేట్ చేస్తుంది. దాంతో స్ట్రెచ్ మార్క్స్ లైట్ గా మారిపోతాయి. ఎలా పనిచేస్తుంది: వెల్లకిలా, నిటారుగా పడుకుని, ఆముదం నూనెత చేతిలో వేసుకుని చాతికి అప్లై చేసి మసాజ్ చేయాలి.తర్వాత క్లీనింగ్ వ్రాప్ ను చుట్టుకుని, హీట్ పాడ్ తో 20 నిముషాలు హీట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఈ వ్రాపర్ లాగేసుకుంటుంది. ఈ నేచురల్ రెమెడీస్ ఒక వారం రోజులు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. గుడ్డు:
గుడ్డులో విటమిన్ ఎ, అమినో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి, ఇవన్నీ స్కిన్ సెల్స్ కొత్తగా ఏర్పడుటకు సహాయపడుతుంది. అదే విధంగా చర్మంను కాంతివంతంగా, తేమగా మార్చుతుంది. ఎలా పనిచేస్తుంది: గుడ్డులోని పచ్చసొన తీసుకుని బ్రెస్ట్ కు మసాజ్ చేయాలి. స్కిన్ స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంటే, అప్పడు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీ స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.

3. బంగాళాదుంప జ్యూస్:
ఈ పిండి కూరగాయలో యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉంటుంది. బంగాళాదుంపలో విటమిన్ సి, పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,ఇనుము,జింక్ మరియు B విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. దీనిలో ఉండే గొప్ప పోషక కంటెంట్ కారణంగా స్ట్రెచ్ మార్క్స్ నివారణలకు గొప్పగా పనిచేస్తుంది. మీరు ప్రభావిత ప్రాంతంలో బంగాళదుంప రసాన్ని రాయటం లేదా బంగాళదుంప ముక్కతో రుద్ది ఒక అరగంట అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

4. పంచదార:
పంచదార స్పటిక రూపంలో గరుకుగా ఉంటుంది, దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయడం వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవ్వడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ను నివారిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను తేలికపరుస్తుంది. కావల్సినవి: పంచదార : 1 టేబుల్ స్పూన్ బాదం నూనె: 10 చుక్కలు నిమ్మరసం: 1 టీస్పూన్ ఎలా పనిచేస్తుంది: పైన సూచించిన పదార్థాలలో ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి, ఈ మిశ్రమంను బ్రెస్ట్ పై అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. 5మర్ధన చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. స్ట్రెచ్ మార్క్స్ నివారించడానికి ఈ హోం రెమెడీని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. అలోవెర జెల్ :
అలోవెర జెల్లో అలోసిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్స్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది కావల్సినవి ఆలివ్ ఆయిల్ : 2టేబుల్ స్పూన్లు అ లోవెర జెల్ : 1 టేబుల్ స్పూన్ ఎలా పనిచేస్తుంది: రెండు పదార్థాలను మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ను ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హెర్బల్ రెమెడీస్ రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేయడం వల్ల ఉదయం స్నానం చేసుకోవచ్చు.

6. నిమ్మరసం:
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్స్ మరియు విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి, ఇవి మొండిగా మారిన స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. ఎలా పనిచేస్తుంది: నిమ్మరసంను రెండు భాగాలుగా కట్ చేసి, స్ట్రెచ్ మార్క్స్ మీద మర్ధన చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని ప్రతి రోజూ స్ట్రెచ్ మార్స్ కనబడనంత వరకూ ఫాలో అవ్వాలి.

7. ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్ ఆరోమాటిక్ ఆయిల్స్ చమోమైల్, అవొకాడో, బాదాం ఆయిల్ మరియు జోజోబా ఆయిల్ వంటి సుగంధ తైలాలు చర్మంపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టడానికి సహాయపడుతాయి. ఈ ఆరోమాటిక్ ఆయిల్స్ కి లావెండ్ ఆయిల్ మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను అంధిస్తుంది. అంతే కాదు కొత్తగా ఎటువంటి స్ట్రెచ్ మార్క్సు.



Click it and Unblock the Notifications