Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
స్త్రీ ఉద్యోగిని ఐతే... కేశ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ద...!?

పని ఒత్తిడి ఇంకా తీరిక లేకపోవడంతో ఆహారంపై శ్రద్ధ చూపరు. జంక్ ఫుడ్ లతో బరువు పెరుగుతారే కానీ కావలసిన పోషక తత్త్వాలు లభించవు. దీనితో రక్తహీనతకు గురవుతుంటారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం, నెరవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి వారు వారి జీవన విధానంలో కొద్దిగా మార్పులు చేసుకొని, ఆహారపు అలవాట్లు మార్చుకొన్నట్లైతే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఉద్యోగినులు సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలి. లేకపోతే 'ఎనిమియా'కు లోనగుతారు. కాలక్రమేణా జుట్టురాలి పోతుంది. దిగువ సలహాలను క్రమం తప్పకుండా ఉద్యోగినులు ఆచరించాలి.....
1. షికాకాయ్, ఉసిరి పొడి సమపాళ్లలో తీసుకోవాలి. రాత్రి పూట ఈ పొడులను తగినన్ని నీళ్లలో కలిపి నానబెట్టాలి.ఈ మిశ్రమంతో మరుసటి రోజు తల స్నానం చేయాలి. శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం, చుండ్రు సమస్య వంటివి బాధించవు.
2. గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి.
3. వీలైనంత మటకు ప్రతి రోజు తలస్నానం చేయాలి. అలాగే రాత్రిపూట నూనె పట్టించి కురుళ్లనుంచి మసాజ్ చేయాలి. హెయిర్ డ్రయ్యర్‌ను వాడకుండా అలానే గాలికి ఆరనివ్వాలి.
4. తడి శిరోజాలను పొడి చేద్దామనే ఉద్దేశంతో వాటిని రాసి రంపాన పెట్టవద్దు. రోజూ ఉదయాన్నే తేలిక పాటి వ్యాయామం చేయాలి. అలా చేస్తే శిరోభారం అనిపించదు. తల స్నానం తర్వాత శిరోజాలు వాటంతట అవే ఆరే లా చేయండి. రాత్రి కనీసం 7 గంటల నిద్ర అవసరం.
5. ఆహారంలో 'ఐరన్' సమపాళ్లలో ఉంటే ఎనీమియా రాదు. బైట జంక్ ఫుడ్ తినటం మానేయ్యాలి. ఆహారం నిదానంగా తీసుకోవాలి. అల్పాహారానికి 15 నిమిషాలు, భోజనానికి అరగంట సమయం వెచ్చించాలి. ఆహారం ఏమి తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అనేవి ముఖ్యం. అల్పాహారం, భోజన సమయాల్లో వ్యర్థ ప్రసంగాలు వద్దు. ఆహారం ఆదరా, బాదరాగా తీసుకోరాదు. మౌనంగా ఆహారం తీసుకోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications
