Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
నిగనిగలాడే నల్లటి కురల కోసం...

1. ప్రతిరోజు తలస్నానం, కండీషనింగ్ చేసుకోవాలి. ఆలీవ్ నూనెకు గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత తలస్నానం చేస్తే, జట్టుకు చక్కని పోషణ అంది పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
2. ఉసిరి కేశాలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎండు ఉసిరిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి తలస్నానం చేయడానికి ఉపయోగించాలి.
3. రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్ నూనె కలిపి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి తలంతా బాగా పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
4. చేపలు, పాలు, ఉల్లిగడ్డలు, అల్లం, క్యాబేజ్ లలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
5. వెంట్రుకలు మరీ జీవం కోల్పోయినట్లు అనిపిస్తున్నట్లయితే.. అరకప్పు బాగా పండిన అరటిపండు గుజ్జుకు నాలుగైదు చుక్కల బాదం నూనె చేర్చి జుట్టుకు బాగా పట్టించాలి. కాసేపటి తరువాత, ముందుగా సోడాతోనూ ఆ తర్వాత నీటితోనూ కడిగేయాలి. చివరగా కండిషనింగ్ చేసుకుంటే జట్టు సహజ స్థితిలోకి వస్తుంది.
6. ఐరన్ లోపంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పళ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నిమ్మ జాతి పళ్లు, కాలీఫ్లవర్స్, ఆకు కూరలలో ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య వల్ల కూడా జట్టు రాలుతుంది. విటమిన్ ఎ, ఆయోడిన్‌తీసుకోవడం వల్ల జట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. క్యారెట్, పాలకూర, అవిశల నూనె, గుమ్మడి పండు, సముద్ర ఉప్పు తీసుకోవడం వల్ల దీనిని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications
