Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టుకు సంబంధించిన అన్నీ సమస్యల నివారణకు హెన్నా...

జుట్టుకు సంబంధించిన ఏ సమస్యకైనా హెన్నా లేదా గోరింటాకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హెయిర్ డైలు వాడే వారికి... పెర్మింగ్, స్ట్రెయిటనింగ్ చేయించుకున్నప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు, తల పొడిబారి, చుండ్రువచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్యలన్నింటికీ హెన్నా దివ్యౌషధంలా పనిచేస్తుంది. అయితే, సరైన రీతిలో వాడితేనే ప్రయోజనాలు పొందగలుగుతాం.ముఖ్యంగా పచ్చిగోరింటాకు ముద్ద కాకుండా పొడిని వాడాలి. అలాగే అన్నివయసులవారూ హెన్నాను ఒకేరకంగా పెట్టుకోకూడదు. వయసును బట్టి దీనిని వాడాల్సి ఉంటుంది. ఎలాగంటే.
1. యుక్తవయసువారు నెలకోసారి గంట చొప్పున పెట్టుకొన్నా సరిపోతుంది.
2. ఇరవై నుంచి ముప్ఫైఏళ్లలోపువారు ప్రతి పదిహేనురోజులకోసారి గంట చొప్పున పెట్టుకోవాలి.
3. ముప్ఫైఏళ్లు దాటినవారు వారానికోసారి గోరింటాకు పెట్టుకోవాలి. అయితే ఓ వారం అరగంట, మరోవారం గంట.. ఈ క్రమంలో పెట్టుకుంటేనే సరైన ప్రయోజనాలు పొందవచ్చు.
4. హెన్నాను గంట కంటే ఎక్కువసేపు పెట్టుకోకూడదు. అంతకు మించితే జుట్టు ఎండిపోయినట్లుగా మారుతుంది. నుదుటి పైముడతలూ ఏర్పడతాయి.
5. హెన్నాతో మృదువుగా: రెండుకప్పుల హెన్నాపొడి, అరకప్పు ఉసిరికపొడి, చెంచా మెంతిపొడి, రెండుచెంచాల వేపాకుపొడి, రెండు నిమ్మకాయలు లేదా నాలుగుచెంచాల పుల్లటిపెరుగు, అరకప్పు టీ డికాక్షన్ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి గంటపాటు నానినతర్వాత తలకుపెట్టుకోవాలి. ముప్పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. పదిహేనురోజులకోసారి ఇలా చేస్తే చుండ్రు, తలలో దురద తగ్గి జుట్టు మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications