Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చుండ్రు లేకుండా...ఆరోగ్యకరమైన శిరోజాలకు....

కురులు ఆరోగ్యంగా పెరగడానికి మాంసకత్తులు అధికంగా కావాలి. ఇవి శిరోజాల ఎదుగుదలకీ కీలకం. వీటి నుంచి ఒమెగా 2బాగా లభిస్తుంది. ఇది జుట్టు పొడిబారిపోకుండా కాపాడుతుంది. చుండ్రు రాకుండా చూస్తుంది. గుడ్డు, చేపలు తినలేని వారికి సోయా చక్కని ప్రత్యామ్నాయం. ఆరోగ్యవంతమైన కుదుళ్లకి సోయాలోని లైసీన్ అమినో ఆమ్లం బాగా ఉపకరిస్తుంది. మొలకలొచ్చిన గోధుమలో విటమిన్ ఇ ఎక్కువ.
నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుషక్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాధ తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన శిరోజాలు మీ సొంతమవుతాయి. ఇంకా తణదాన్యాలు, బాదం, సముద్ర చేసలు, మటన్ల నుంచి జింక్ లభిస్తుంది. రోజులో కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మేలు...
వ్యాదినిరోధక శక్తిని పెంచి శిరోజాలు రాలిపోకుండా కాపాడే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంది. బాదం తినే వారిలో యాంటీ ఆక్సిడెంట్లకు కొదువ ఉండదు. కాలుష్యానికి యూవీ కిరణాలకు ప్రభావితం అయి శిరోజాలు పాడవకుండా బాదం చూస్తుంది. ముఖ్యంగా రక్త ప్రసారం బాగుపడేట్టు చేస్తుంది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అందడానికి కాషాయం రంగులో ఉండే పండ్లు కాయగూరలు తినాలి. అంటే మామిడి, కమల, బొప్పాయి, క్యారెట్, కూర గుమ్మడి.
ఆహారంతో పాటు చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లైతే చుండ్రు చిక్కులను తప్పించుకోవచ్చు. అందుకు కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కలబంద గుజ్జు కలిపి మాడుకు సున్నతంగా మర్ధన చేస్తుండాలి. దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.



Click it and Unblock the Notifications