Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మగవారికీ ఆకులతో బలమైన..ఒత్తైన జట్టు...

అందమైన కురుల కోసం రకరకాల సౌందర్యసాధనాలు వాడటం కద్దు. వాటితో పాటు ఆహారం విషయంలోనూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అందంతోపాటు ఆరోగ్యాన్నీ సంతరించుకుంటాయి కేశాలు. ప్రత్యేకించి కొన్ని రకాల ఆహారపదార్థాలు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లలో మార్పులు కలగజేసి హానికర రసాయనాలుగా మారుస్తాయి. ఆ రసాయనాలు కేశగ్రంథులను బలహీనపరచి జుట్టురాలిపోయేలా చేస్తాయి. కాబట్టి అలాంటి ఆహారపదార్థాలను అతిగా కాకుండా ఒక పరిమితిలో తీసుకోవాలి.ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. అయితే ఆకుకూరలు కొన్ని తినడం వల్ల ప్రయోజనం చేకూరితే, మరికొన్ని హెర్బల్స్ గా ఉపయోగించడం వల్ల వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
1. మెంతి ఆకులు: ఒక కట్ట మెంతి ఆకులు మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకొని అందులో 2టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి తలకు పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా గట్టిపడటమే కాకుండా మిలమిల మెరుస్తాయి.
2. ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.
3. చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టీ, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడడమే కాదు, చుండ్రు బాధ నుంచి దూరమవ్వచ్చు.
4. మందారం ఆకులు కొద్దిగా తీసుకొని అందులో పెరుగు, రాత్రి నాటబెట్టిన మెంతులు వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకొని తలకు పట్టించి అరగంట తర్వతా గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే వెంట్రుకలు నైస్ గా ఉంటాయి.
5. మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకొని దాంట్లో అరకప్పు శనగపిండిని కలపాలి. దాన్ని మాడకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవాలి.



Click it and Unblock the Notifications