Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
చుండ్రు,దురద,ఇతర ఇన్ఫెక్షన్ల నివారణ బెస్ట్ ఆయిల్స్
సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. చుండ్రు మాత్రమే కాదు, తలలో దురద, తలలో మొటిమలు, చర్మంపొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, మరియు ఇతర జుట్టు సమస్యలు. జుట్టు సమస్యలకు అనేక ఖరీదైన ట్రీట్మెంట్స్ తో పాటు, వంటింటి చిట్కాలను కూడా పాంటించి ఉంటారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకోవడం, చిట్కాలను పాటించడం పక్కన పెట్టి కొన్నిఎఫెక్టివ్ నూనెలను ఉపయోగించి చుండ్రును నివారించుకోండి. చుండ్రునివారణకు ఇక్కడ మేము కొన్ని బెస్ట్ ఆయిల్స్ తెలుపుతున్నాం.
చుండ్రును పూర్తిగా నివారించడంలోనూ మరియు అద్భుతమైన జుట్టును పొందడానికి మనకు తెలియని కొన్ని ముఖ్యమైన నూనెలు ఉన్నాయి. ఈ ముఖ్యమైన నూనెలు చుండ్రును మాత్రమే వదలగొట్టడం కాదు, మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ నూనెలు మీ జుట్టుకు తగినంత పోషణను అంధిచడంతో పాటు తలలో అన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ ను నివారిస్తుంది.
చుండ్రును నివారించే కొన్ని బెస్ట్ ఆయిల్స్ ..

టీట్రీ ఆయిల్:
టీట్రీ ఆయిల్ చాలా రకాల యాంటీ డాండ్రఫ్ షాంపులలో ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే చుండ్రును నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీఫంగల్, మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చుండ్రును నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతాయి. చుండ్రు నివారించడం కోసం ఈ టీట్రీ ఆయిల్ ను వేరే ఇతర నూనెలతో చేర్చి ఉపయోగించుకోవచ్చు. ఎందకంటే, టీట్రీ ఆయిల్ డైరెక్ట్ గా తలకు పట్టించడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కాబట్టి వేరే నూనెలతో మిక్స్ చేసి తలకు పట్టించవచ్చు.

రోజ్మెరీ ఆయిల్:
చుండ్రును అరికట్టడంలో రోజ్మెరీ హెయిర్ ఆయిల్ చాలా ప్రయోజనకరమైనది. రోజ్మెరీ ఆయిల్లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మాత్రమే కాదు, మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది ఒక మంచి యాస్ట్రిజెంట్ గా పనిచేసి తలను శుభ్రం చేసప్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించినట్లైతే జుట్టును నల్లగా మార్చుతుంది. కాబట్టి ఈ ముఖ్యమైన నూనెను చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి తప్పక ఉపయోగించండి.

ల్యావెండర్ ఆయిల్:
మీరు తలలో తెల్లగా పొట్టు రాలడం, లేదా జుట్టు పొరలుగా ఉండటం వంటి సమస్యలకు లావెండర్ ఆయిల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ కి ఒక స్పూన్ లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి, గోరువెచ్చగా కాచి, తలకు మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ ను పెట్టుకొని అరగంట అలాగే ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రును నివారించడంలో లావెండర్ ఆయిల్ బెస్ట్ ఆయిల్.

పెప్పర్మింట్ ఆయిల్:
పెప్పర్మింట్ ఆయిల్ తలను చల్లబర్చడంతో పాటు యాంటీసెప్టిక్ గుణాలున్నాయన్న విషయం మనకు తెలిసింద. ఇది చుండ్రును నివారిస్తుంది, మరియు తలలో దురద మరియు చీకాకును నివారించి జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. పెప్పర్మింట్ ఆయిల్ ను వేరే ఇతర నూనెలతో మిక్స్ చేసి తలకు పట్టించాలి. చుండ్రు నిర్మూలించడానికి దీన్ని తప్పకు ఉపయోగించండి.

చమోమైల్ ఆయిల్:
చామంతి నూనె చుండ్రును నిర్మాలించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. చీకాకును నుండి విముక్తి కలిగిస్తుంది. తలలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. మరియు జుట్టును నునుపుగా తయారుచేస్తుంది. ఈ చమోమిలీ నూనెను మీరు రెగ్యులర్ గా ఉపయోగించే ఇతర నూనెలతో మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఈ బెస్ట్ ఆయిల్ తో మీ జుట్టును మసాజ్ చేసి చుండ్రును నివారించండి.

యూకలిప్టస్ నూనె:
తల మాడును ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచి కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి గోరివెచ్చని యూకలిప్టస్ ఆయిల్ ను తలకు బాగా మర్ధన చేయండి. రాత్రంతా ఆలాగే ఉంచి, ఉదయం షాంపూ మరియు కండీషనర్ తో తలస్నానం చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. అంతే కాదు కురులు పెరిగేలా చేసి, సున్నితంగా ఉంచితుంది. ఈ నూనెలోని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలలోని ఇతర సమస్యలన్నింటినీ నివారిస్తుంది. చుండ్రును నివారించి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications
