For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రును తక్షణం పోగొట్టే 20 సులభ చిట్కాలు...!

By Super
|

చుండ్రు ఒక చిత్రం విపత్తు మరియు విశ్వాసం సంహర్త ఉంటుంది. విషయాలు మరింత దిగజార్చి, నిరంతర దురద మోటిమలు దారితీస్తుంది! చుండ్రు షాంపూ కొనుగోలు కర్మ దాటవేసి మీ చుండ్రు ఆందోళనలతోపాటు బయటకు కడగడం అని 20 హోమ్ నివారణలు తనిఖీ.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

లెమన్ వాష్: రెండు మూడు నిమ్మ తొక్కలను తీసుకొని ఐదారు కప్పుల నీటిలో వేసి 15-20నిముషాలు బాగా ఉడికించాలి. ఉడికించి చల్లార్చిన తర్వాత, ఈ నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

మెంతులతో చికిత్స: 2టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు మరియు కేశాలకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా పాటించండి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

లెమన్ జ్యూస్ మసాజ్: స్నానానికి వెళ్లేముందు మీ తలకు నిమ్మరసాన్ని బాగా పట్టించాలి. నిమ్మరసం పట్టించిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చిక్కుఉండదు, చుండ్రును నివారిస్తుంది మరియు మీ కేశాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

వెనిగర్ ట్రీట్మెంట్: వెనిగర్ మరియు నీళ్ళు సమపాళ్ళలో తీసుకొని, బాగా మిక్స్ చేసి రాత్రి నిద్రపోయే ముందు తలకు బాగా పట్టించాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ తలను తేలికపాటి బేబీ షాంపూను ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

పెరుగు: మీ కేశాలకు పెరుగును బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

తలకు గుడ్డు: రెండు గుడ్లను పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి, ఈ సొనను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

గోరివెచ్చని ఆయిల్ మసాజ్ : గోరువెచ్చని బాదాం నూనె, కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ ను తలకు బాగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయడం వల్ల చుండ్రును సులభంగా వదలగొడుతుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

అలోవెరా జెల్: తలస్నానం చేయడానికి 20నిముషాల ముందు అలోవెర జెల్ ను తలమాడుకు బాగా మర్దన చేయాలి. మసాజ్ చేసిన అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

కొబ్బరి నూనె: ఒక టేబుల్ స్సూన్ నిమ్మరసానికి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మిక్స్ చేసి బాగా గిలకొట్టి తలమాడుకు కేశాలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

ఆపిల్ : ఆపిల్ మరియు ఆరెంజ్ నుండు సమభాగాలుగా తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలకు మంచి పోషణ అందిస్తుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

వేపాకు పేస్ట్: కొన్ని వేపాకు ఆకులను మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి, మీ తలకు బాగా పట్టించాలి. పట్టించిన ఒక గంట తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

తులసి మ్యాజిక్: తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

వెల్లుల్లి: 2టేబుల్ స్సూన్ల వెల్లుల్లి పేస్ట్ లేదా పౌడర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్సూన్ నిమ్మరసం కలిపి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసి మీ తలకు పట్టించి 30-45పాటు అలాగే ఉంచి తర్వాత షాంపూ మరియు చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

శీకాకాయ నేచురల్ డాండ్రఫ్ ట్రీట్మెంట్: మీరు శీకాకాయతో తయారు చేసిన సోపు లేదా షాంపూ లేదా శీకాకాయ పౌడర్ తలకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత చల్లటి నీటితో స్నానం చేసుకోవాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

ఉల్లిపాయ పేస్ట్: మీ తలకు ఉల్లిపాయ పేస్ట్ బాగా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత తాజా నిమ్మరసంతో తలస్నానం చేయడం వల్ల ఉల్లిపాయ వాసన పోతుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

అల్లం మరియు బీట్ రూట్ పేస్ట్: అల్లం మరియు బీట్ రూట్ ను మెత్తని పేస్ట్ లా తయారు చేసి, తలకు బాగా పట్టించాలి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమంత ప్పకుండా చేయడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

బేసన్ థెరఫీ: శెనగపిండి(బేసన్)ని పెరుగుతో బాగా మిక్స్ చేసి చల్లచల్లగా తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

బేకింగ్ సోడా ట్రీట్మెంట్: తలకు షాంపూ చేసేటప్పుడు బేకింగ్ సోడాను నీళ్ళలో కాని లేదా డైరెక్ట్ గా తలకు కానీ పట్టించాలి. పట్టించిన 10-15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

రోజ్మెరి టెక్నిక్స్: రోజ్మెరీ లీవ్స్ నూనెలో వెనిగిర్ మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. లేదా రోజ్మెరి ఆయిల్ మరియు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది.

చుండ్రు శాశ్వత నివారణకు 20 బెస్ట్ టిప్స్...!

రెగ్యులర్ తలస్నానం: తలస్నానం రెగ్యులర్ గా లేదా దినం మార్చి దినం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. హెయిర్ గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించు చుండ్రులేని తలను సొంతం చేసుకోండి.

English summary

20 best home remedies to get rid of dandruff | చుండ్రును తక్షణం పోగొట్టే 20 సులభ చిట్కాలు...!

Dandruff can be an image disaster and confidence slayer.To make matters worse, persistent itching can lead to acne! Skip the dandruff shampoo-buying ritual and check out 20 home remedies that will wash out your dandruff worries.
Desktop Bottom Promotion