Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మగమహారాజులూ. ఈ వేసవికాలంలో మీ కేశ రక్షణకు హెచ్చరికలు...
సాధరణంగా కాలాన్ని, సీజన్ బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది. వాతావరణం మార్పును బట్టి ఉష్టోగ్రతలల్లో మార్పు సంతరించుకుంటుంది. దానివల్ల మానవ శరీరంలో కూడా మార్పులు సంబవిస్తాయి. ఉదాహరణకు శీతాకాలం చలి ఎక్కువగా ఉండటం. చర్మం పగుళ్ళు ఏర్పడం, జుట్టు జిడ్డుగా లేదా పొడిబారటం జరుగుతుంది. వేసవికాలంలో చర్మ పొడిబారడం, డీహైడ్రేషన్ కు గురికావడం, సన్ టానింగ్, సన్ బర్న్ వంటి సమస్యలను ఎదుర్కొంటాం. అందుకు బయటకు వెళ్ళడానికి ముందు కొన్నిసన్ స్ర్కీన్ లోషన్ వాడటం మరియు గొడుగులు తప్పనిసరిగా వినియోగించడం చేస్తుంటాం. కాబట్టి చర్మానికి రక్షణ కల్పించి, కేశాల పై సరైనజాగ్రత్తలు తీసుకోము. చర్మ సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో... అదే విధంగా జుట్టు సంరక్షణకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది కేశాలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారవుతాయి. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్ కిరణాల కారణంగా కొనలు చిట్లి, పొడిబారినట్లు కనిపిస్తాయి. సూర్యుని తాపానికి తలలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల కేశాలు ఎప్పుడూ జిడ్డుగా మారుతాయి. ఇటువంటి కురుల సమస్యలను అధిగమించడానికి వేసవికాలంలో మహిళలు మంచి పద్దతులను అవలంభిస్తారు. అయితే పురుషుల్లో అటువంటి వాటిని అసలు పట్టించుకోరు. ఒక కండీషన్ తప్ప మరే విధమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టురాలడం, బట్టతల, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది కాబట్టి, వేసవిలో మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా వారి కేశ సంరక్షణపై అవగాహన కల్పించుకొంటే హెయిర్ డ్యామేజ్ ను అరికట్టవచ్చు... అందుకు పురుషులు తీసుకోవల్సిన కొన్ని హెయిర్ కేర్ టిప్స్:
1. ప్రతి రోజూ షాంపూ వాడాలి: వేసవిలో తలలో చెమట పట్టడం సాధారణం. కాబట్టి సహజంగానే తల మురికిగా మారుతుంది. కాబట్టి అందుకు ప్రతి ఆల్టర్నేట్ డేస్ కి తలస్నానం ఆచరించడం మంచిది. కేశాలను ఇలా శుభ్రపరుచుకోవడం వల్ల చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అంతే కాకుండా ఫ్యూచర్ లో ఎటువంటి హెయిర్ డ్యామేజ్ లేకుండా కాపాడుకోవచ్చు.

2. క్లోరిన్ వాటర్ కు దూరంగా: వేసవి కాలంలో, చాలా మంది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. స్విమ్మింగ్ పూల్లో ఉండే నీటిలో క్లోరిన్ కలపడం వల్ల ఆ నీరు కేశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించి కేశాలు పొడిబారేట్లు చేస్తాయి. కాబట్టి స్విమ్మింగ్ క్యాప్ ను ఉపయోగించడం వల్ల కేశాలకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.
3. తలకు ఆయిల్ మసాజ్: హెయిర్ కేర్ లో హెయిర్ కండీషన్ చాలా ముఖ్యం. అదేవిధంగా, ఈ కాలంలో తలకు నూనెతో మసాజ్ చేయడం కూడా అవసరమే. వారంలో మూడుసార్లు తలకు నూనె పట్టించడం వల్ల కేశాలను హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇంకా కేశాలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
4. కేశాలు కురచగా ఉంచుకోవాలి: వేసవికాలో పురుషులకు పొడవైన జుట్టు చాలా ఇబ్బంది కరంగా మార్చుతాయి. కాబట్టి వేసవిలో కేశాలు పెరినంతా నెలకొకసారి హెయిర్ కట్ చేసుకోవడం అవసరం. అంతే కాకుండా ఇంటి నుండి బయట వెళ్ళే టప్పుడు తప్పనిసరిగా తలకు క్యాప్ ధరించడం అలవాటు చేసుకోవాలి.
5. హెయిర్ సన్ స్క్రీన్ లోషన్: అవును! సన్ స్క్రీన్ లోషన్ చర్మ సంరక్షణకు మాత్రమే కాదు, కేశ సంరక్షణకు ఉపయోగిస్తారు. సన్ డ్యామేజ్ నుండి ఉపశమనం పొందాలంటే హెయిర్ సన్ స్క్రీన్ లోషన్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి. వేసవి కాలంలో మీకు కావల్సి హెయిర్స్ జెల్స్ అన్నింటినీ మీ కప్ బోర్డ్ లో స్టాక్ పెట్టుకోండి. ఈ చిన్న పద్దతులను ఉపయోగించి వేసవి కాలంలో ఆల్ట్రావయోలెట్ కిరణాల తాకిడి నుండి రక్షణ పొందండి.



Click it and Unblock the Notifications
