Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
తడిజుట్టు ముడివేయడం వల్ల జుట్టుకు జరిగే ప్రమాదం?
జుట్టు సమస్యలను నివారించడం ఎప్పటికి సాధ్యం కాదని గ్రహించలేరు, ఎందుకంటే జుట్టు సమస్యలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. కురులకు సరైన పోషణ అంధివ్వకపోవడం మరియు నిరాశతో ఉండటం కంటే, మీ కేశాల గురించి మంచి శ్రద్ద తీసుకోవడం ఉత్తమం.
ఒక వేళ మీజుట్టు, కర్లింగా లేదా స్ట్రెయిట్ (నిఠారుగా)ఉన్న జుట్టా అన్నది కాదు, ఎటువంటి జుట్టు తత్వం ఉన్నవారైనా సరే, ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యలు, చుండ్రు సమస్యలు కలిగి ఉంటారు. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు వెంటనే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదా దీర్ఘకాలం జుట్టు సమస్యలు ఉన్నా, లేదా తడి జుట్టును ముడివేయడం వల్ల, జుట్టు నిర్వహాణ సరిగా లేకపోయినా జుట్టు నష్టం అధికంగా ఉంటుందనే సాధరణ పరిజ్ఘానం కలిగి ఉండాలి. షవర్ బాత్ చేసేటప్పుడు కేశాలకు డ్యామేజ్ కలుగుతుందని ఏ ఒక్కరు తెలుసుకోరు. షవర్ బాత్ తర్వాత మీ జుట్టును ఎప్పుడైతే ముడి వేస్తారో, అప్పుడు మీ జుట్టు బలహీనపడుతుంది. వెట్ హెయిర్, తడి జుట్టును ముడి వేయడం వల్ల జుట్టుకు కలిగే డ్యామేజ్ లిస్ట్ కు ఇక్కడ మీకోసం అంధిస్తున్నాం. వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోండి...

హెయిర్ డ్యామేజ్: ఎప్పుడైతే కేశాలు తడిగా ఉంటాయో, అప్పుడు జుట్టు జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, తడి జుట్టును ముడివేయడం కానీ లేదా దువ్వడం కానీ ఎప్పటీకి ప్రయత్నించకూడదు. తడి జుట్టును దువ్వడం లేదా ముడివేయడం వల్ల జుట్టు మూలాలు తెగిపోయేలా చేస్తాయి. ఈ దృఢమైన చర్యలు తీవ్రమైన జుట్టు నష్టంకు దారితీస్తుంది. ఇటువంటి చర్యలు పాటించాలనుకొన్నప్పుడు ముందుగా జుట్టునుండి తడిని తొలగించాలి. అందుకు కురులను పిండి నీటిని తొలగించాలి. ఆ తర్వాత తడి జుట్టును ఒక కాటన్ వస్త్రంతో బాగా పొడిగా, తడి పూర్తిగా పోయాల తుడుచుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన జుట్టును పొందగలుగుతారు.
హెయిర్ లాస్: తడిగా ఉన్న జుట్టును ఎప్పటి పోనీటైల్ వేయకూడదు. తడిజుట్టును గట్టిగా బిగించడం వల్ల కేశాలకు డ్యామేజ్ కలిగి, జుట్టు రాలే అవకాశం ఉంది. నీరు కారే జుట్టును ముడివేయడానికి ఉపయోగించే హెయిర్ ఎలాస్టిక్ ఖచ్చితంగా మరింత జుట్టు నష్టాన్ని కలిగిస్తుంది. మరియు జుట్టు తెగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జుట్టును టై చేయడానికి ముందు ఖచ్చితంగా పొడి (జుట్టు పూర్తి ఆరేలా)చేసుకోవాలని గుర్తుంచుకోవాలి.
చుండ్రు సమస్య: తడి జుట్టును ముడివేయకుండా ఉండటానికి ఇది మరో కారణం. జుట్టు బాగా తడి ఆరిన తర్వాత ముడి వేయడం లేదా దువ్వడం వంటివి చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జుట్టు తడితో, నీరుకారుతున్నట్లున్నపుడు, ముడి వేయడం, తలదువ్వడం, లేదా జడవేయడం వంటి పనులు చేయడం వల్ల త్వరగా చుండ్రు చేరే అవకాశం ఉంది. తేమ లేదా చెమట వల్ల కూడా చుండ్రు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీ తడి వెంట్రుకులను ఎప్పటికీ ముడి వేయకండి.
తలలో దురద: తలలో దురుద, చిరాకు పెట్టడానికి ప్రధాన కారణం చుండ్రు. చెమట కంటే తడి జుట్టే అధిక చుండ్రుకు కారణం అవుతుంది. చుండ్రు వల్ల మీ జుట్టు తడి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరియు తలలో ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. తడి ఉన్నప్పుడు ఇది తల మొత్తం వ్యాప్తి చెందుతుంది.
జుట్టు పెళుసు బారుతుంది: తడి జుట్టును ముడి వేయడం వల్ల జుట్టు పెళుసుభారుతుంది. కాబట్టి జుట్టు తడిగా ఉన్నప్పుడు మీ జుట్టును ముడి వేయడానికి ప్రయత్నించకండి. తడిగా ఉన్నప్పుడు కేశాల నుండి నీటిని పూర్తిగా పిండేయాలి.
జుట్టు పల్చబడటం లేదా బట్టతలకు కారణం కావచ్చు: తడి జుట్టును నిర్వహించడం ద్వారా తలకు హానీ కలిగిస్తుంది. తడిగా వున్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు యొక్క నాణ్యత లోపిస్తుంది. జుట్టు కఠినంగా మారతుంది. దాంతో జుట్టు రాలి, పచ్చగా మారడం లేదా బట్టతలకు ప్రధాన కారణం కావచ్చు.



Click it and Unblock the Notifications
