Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
జుట్టు నల్లగా-ఆరోగ్యంగా పెరగడానికి వంటింటి చిట్కాలు
మన శరీరం లో జుట్టు, చర్మం, గోళ్లు బాగుండడం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంలో సైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం తో పాటు జుట్టు నిర్జీవంగా తయారవుతాయి. చర్మం పూర్తిగా పొడిబారీ పోవడం, మొటిమలు రావడం, జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, వంటివి లక్షణాలు కనబడితే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా లేము అనడానికి సూచనలు. కొద్దిపాటి సలహాలు, సూచనలతో జాగ్రత్త తీసుకొని, మంచి ఆహారపు అవాట్లు వల్ల మీ జుట్టు అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. నల్లగా, పట్టుకుచ్చులాంటి అందమైన జుట్టు కోసం..

గుడ్డుతో ప్యాక్
ప్రతిరోజు తలస్నానం, కండీషనింగ్ చేసుకోవాలి. ఆలీవ్ నూనెకు గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత తలస్నానం చేస్తే, జట్టుకు చక్కని పోషణ అంది పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

ఉసిరి ప్యాక్
ఉసిరి కేశాలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎండు ఉసిరిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి తలస్నానం చేయడానికి ఉపయోగించాలి.

ఆలివ్ నూనె-
తేనె రెండు టీస్పూన్ల తేనెకు మూడు టీస్పూన్ల ఆలివ్ నూనె కలిపి.. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి తలంతా బాగా పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

సల్ఫర్ ఫుడ్స్
చేపలు, పాలు, ఉల్లిగడ్డలు, అల్లం, క్యాబేజ్ లలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

బాదం ఆయిల్
వెంట్రుకలు మరీ జీవం కోల్పోయినట్లు అనిపిస్తున్నట్లయితే.. అరకప్పు బాగా పండిన అరటిపండు గుజ్జుకు నాలుగైదు చుక్కల బాదం నూనె చేర్చి జుట్టుకు బాగా పట్టించాలి. కాసేపటి తరువాత, ముందుగా సోడాతోనూ ఆ తర్వాత నీటితోనూ కడిగేయాలి. చివరగా కండిషనింగ్ చేసుకుంటే జట్టు సహజ స్థితిలోకి వస్తుంది.

సి విటమిన్స్ ఫుడ్స్
ఐరన్ లోపంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పళ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నిమ్మ జాతి పళ్లు, కాలీఫ్లవర్స్, ఆకు కూరలలో ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య వల్ల కూడా జట్టు రాలుతుంది. విటమిన్ ఎ, ఆయోడిన్‌తీసుకోవడం వల్ల జట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. క్యారెట్, పాలకూర, అవిశల నూనె, గుమ్మడి పండు, సముద్ర ఉప్పు తీసుకోవడం వల్ల దీనిని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications