Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పెరుగుతో జుట్టుకు మెరుపు: హోం మేడ్ హెయిర్ ప్యాక్
జుట్టు సంరక్షణకు ఎన్ని కండీషనర్లు రాసుకున్నా మీ జుట్టు మళ్ళీ పొడిగానే తయారవుతోందా? జుట్టు చివర్లు చిట్లిపోయి.. జుట్టంతా డ్యామేజ్ అవుతోందా? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉంది. అదేంటంటే...‘పెరుగుతో హెయిర్ ప్యాక్స్'. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడుతాయి. ఈ క్రమంలో పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొనే హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసేద్దామా...

1. తేనెతో జుట్టుకు మంచి షైనింగ్: జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.
కావల్సినవి: గడ్డపెరుగు : ఒక కప్పు, నిమ్మరసం: ఒక చెంచా, తేనె: ఒక చెంచా

ప్యాక్ వేసుకోవడం ఇలా: ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రామన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేయాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది.
గుర్తుంచుకోవల్సినది: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
2. ఆలివ్ ఆయిల్ తో : మీ మాడంతా పొడిగా అయిపోయి..చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే, డోంట్ వర్రీ ఈ ప్యాక్ ఓసారి ప్రయత్నిస్తే సరిపోతుంది.
కావల్సినవి: గడ్డ పెరుగు: 1కప్పు, ఆలివ్ ఆయిల్: 3చెంచాలు

ప్యాక్ వేసుకోవడం ఇలా : ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోనుంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కింద వరకూ ప్యాక్ లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గుర్తుంచుకోవల్సినది: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.
తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి.
3. మృదువైన కురుల కోసం: జుట్టు పొడిగా ఉంటే ఎంత అసౌకర్యంగా ఉంటుందో కదూ..!మరి ఇలాంటి కురులను మృదువుగా, తేమ నిలిచి ఉండేలా తయారు చేసుకోవాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించవచ్చు.
కావల్సినవి: గడ్డ పెరుగు : ఒక కప్పు

ప్యాక్ ఇలా: గడ్డ పెరుగు తీసుకొని పేస్ట్ లాగా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఇలా తయారైన పేస్ట్ ను జుట్టుకు మాడుకు పట్టించి ఒక మాస్క్ లాగా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంటా పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.
గుర్తుంచుకోవల్సినవి: నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికోసారి, పొడిజుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది.
తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండాలి.
4. మినుములతో : జుట్టు మృదువుగా, బలంగా తయారుకావాలంటే, ఈ ప్యాక్ ప్రయత్నించండి.
కావల్సినవి: మినుములు: అరకప్పు, పెరుగు : అరకప్పు

ప్యాక్ వేసుకోవడం ఇలా! మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లాగే చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రామన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృడంగా, మృదువుగా, అందగా తయారవుతుంది.
గుర్తుంచుకోవల్సినవి: ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.
మీరు తలస్నానం కోసం ఉపయోగించే షాంపూ తక్కువ గాఢతదై ఉండాలి.
5. మెంతులతో మెరుపు: మీ జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి..
కావల్సినవి: గడ్డ పెరుగు : ఒకకప్పు, మెంతులు: అరకప్పు

ప్యాక్ వేసుకోవడం ఇలా : ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్ లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్ ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకూ, మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.
గుర్తించుకోవల్సినవవి: ఈ ప్యాక్ పొడిగా ఉన్న జుట్టుపైనే అప్లై చేసుకోవాలి.
వారానికోసారి ఈ ప్యాక్ ట్రై చేయవచ్చు.
వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఈ ప్యాక్ తయారు చేసి పెట్టుకోవాలి.
తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.
చూశారుగా..పెరుగు మీ జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో...కాబట్టి ఇలాంటి సహజసిద్దమైన సులభంగా తయారుచేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మీ కురులను కాపాడుకోండి..



Click it and Unblock the Notifications











