Latest Updates
-
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! -
పంచక కాలం: మే 14 వరకు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఆటంకాలు తప్పవు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. మీ రాశికి ఎలా ఉంది? - సోమవారం, 11 మే 2026 -
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్‌లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: నివారణ చర్యలు
జట్టురాడలడం అరికట్టి, జుట్టు పెరుగుదలకు సహాయపడే చిట్కాలు
నిండైన జుట్టు, వత్తయిన జుట్టు మనిషికి నిలువెత్తు అందానికి నిదర్శనము. నేటికాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా జుట్టు రాలిపోవటం జరుగుతుంది. సమస్యలు, దిగుళ్ల కారణంగానే జుట్టు రాలిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి నివారణోపాయలేమిటో తెలుసుకుందాం.
కారణాలు
1 జుట్టుపుటాలకు మంచి పోషకాలు అందించే చిన్న రక్తనాళాలు బాగా సన్నబడిపోవడంతో జుట్టు ఊడిపోతుంది.
2 ఆరోగ్యమైన జుట్టుకు ఆక్సిజన్, మంచి పోషకాహారం అవసరం. అది తగ్గినప్పుడు కూడా ఊడుతుంది.
3 కొన్ని రకాల హార్మోనులు కూడా కారణం.
నివారణకు మసాజ్
1 మసాజ్ చేయటం ద్వారా జుట్టు కుదుళ్లకు రక్తం సరఫరా అయి, తల మీద చర్మం శక్తివంతమవ్ఞతుంది.
2 చేతివేళ్లతో మసాజ్ చేసుకోండి. రెండు చేతులు జుట్టు లోపలికి చొప్పించి రాస్తూ మసాజ్ చేసుకోండి. జుట్టు ఉండే ప్రదేశం, జుట్టులేని భాగానికి కూడా మసాజ్ చేయండి.
3 మొదట్లో జుట్టు కొద్దిగా రాలినా, కంగారు పడకుండా రెగ్యులర్ చేయండి. కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేసి ఆ నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చెయ్యండి.
4 మంచి ఫలితం కోసం వారానికి రెండుసార్లు ఇలా చేయండి. ఇలా చెయ్యటం వల్ల మృతకణాలను తొలగించవచ్చు. జుట్టు కుదుళ్లు పటిష్ట మౌతాయి. జుట్టు పెరుగుదలకి ఎంతో మేలు చేస్తుంది మజ్జిగలా.

ఆరోగ్యకరమైన జుట్టుకు బి విటమిన్ అవసరం
1 నిండైన జుట్టు నిలబడాలంటే జుట్టు కుదుళ్లు కేశపుటాలు బలంగా ఉండటం ఎంతో అవసరం. అవి వృద్ధిని కోల్పోవటానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఇవే బంగారం లాంటి జుట్టును వెలవెలపోయేలా చేస్తాయి. మిమ్మల్ని చిన్న వయసులోనే పెద్ద వాళ్లలా కనిపించేలా చేస్తాయి. ఇరవై అయిదేళ్ల వాళ్లు కూడా జుట్టు ఊడితే నలభైయేళ్ల వాళ్లలా కనబడతారు.
2 బి విటమిన్ జుట్టును అనూహ్యంగా బలంగా ఒత్తుగా పెంచుతుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. జుట్టు ఊడే సమస్య ఉన్నవాళ్లు ఆహారంలో బి విటమిన్ ఎక్కువ తీసుకోండి.
3 పాంటోథినిక్ అనబడు బి5విటమిన్ నల్లజుట్టును తెల్లబడకుండా చేస్తుంది.
4 ఇనోసిటాల్, పాబా అనే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచటంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆవేశాన్ని తగ్గిస్తాయి. ఆలోచనలని పెంచుతాయి.
5 హిషోవు అనే చైనా మొక్క జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఆక్యుపంచర్ వైద్యుల వద్ద ఈ మొక్క తాలూకు వివరాలు, వాడుక పద్ధతి తెలుస్తుంది.
6 శరీరంలో ప్రతి అవయవముకి పోషణ, జాగ్రత్త అవసరం. అన్ని భాగాలు పూర్తి ఆరోగ్యంగా ఉండటమే పూర్తి అందం. అంతా బావ్ఞండి అన్ని ఉండి కళ్లు మసకబారితే లేదా వినిపించకపోతే ఇలా ప్రతీది అవసరమే. అన్నీ హెల్దీగా ఉండాలి. ఉండాలంటే కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవటమంటే వేళకు తినటం, వేళకు పడుకోవటం, మంచి విషయాలు మాట్లాడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన పనేదో మనంచూసుకోవటం, అనవసర విషయాల్లో కలుగజేసుకుని సాల్వ్ చేయలేక అందులో ఇరుక్కొనిపోయి కోరికోరి సమస్యలు తెచ్చుకోకండి. అలా మన పరిధి, శక్తి తెలుసుకుని ప్రవర్తిస్తే దిగులు, ఆవేదన మంత్రం వేసినట్టు లక్ష్మణ రేఖ గీసినట్టు వేయి ఆమడల దూరంలో ఉంటాయి. అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండటమే పూర్తి అందమైన ఆరోగ్యం.
దట్టమైన జుట్టుకోసం
1 తాజా కమలాపండు రసం తీసుకోండి. తగినంత నీరు, ఒక టేబుల్‌స్పూన్ తేనె, కొన్నిచుక్కలు చందనపు నూనెలను కలిపి మిశ్రమంగా చేయండి. దీన్ని షాంపూ స్నానం తర్వాత జుట్టును కడుక్కోవటానికి వాడండి. కోడిగుడ్డు బాగా బీట్ చేసిన తరువాత టేబుల్‌స్పూన్ పాలతో బాగా కలిపి జుట్టుకు పట్టించండి. పావ్ఞగంట తర్వాత కడిగేయండి. అప్పుడు చూడండి. మీజుట్టు ఎంత కాంతివంతమవుతుందో. రెండు టేబుల్‌స్పూన్ల ఆపిల్ ఫ్లేవర్ గల వెనిగర్‌ని కలిపి దానితో జుట్టు వాష్ చేసుకోండి.
పాలిపోయిన జుట్టు జీవకోసం
1 బాగా మగ్గిన అరటికాయను నలిపి, అందులో కొన్ని చుక్కలు ఆల్మండ్ నూనె కలపండి. కలిపిన ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తూ మసాజ్ చేసుకోండి. పావుగంటాగి సోడానీటితో వాష్ చేసుకోండి. ఆ తర్వాత షాంపూ కండీషనర్‌లు ఉపయోగించండి.
చక్కటి జుట్టుకోసం
1 నిమ్మకాయ గింజలను నల్లటి మిరియాలను తీసుకుని తగినంత నీరు కలిపి బాగా నూరండి. కనీసం వారం పాటు రెగ్యులర్‌గా తలకి పట్టిస్తే నల్లగా మారుతుంది.
2 పచ్చిమామిడి గుజ్జును ఏదైనా నూనెలో సంవత్సరం పాటు ఉంచి ఆ నూనె తరచుగా తలకి పట్టించడం వల్ల అద్భుతఫలితం ఉంటుంది. కాని ఇది ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాదు.
3 వేడి ఆలివ్‌నూనె, తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క లవంగపొడి మొత్తాన్ని మెత్తమెత్తగా వచ్చేలా చూసుకోండి. స్నానానికి వెళ్లటానికి అరగంట ముందు తలకి పట్టించి ఆ పై స్నానం చెయ్యండి.
4 మర్రిఊడలు అందుబాటులో ఉంటే మర్రి ఊడల్ని మెత్తగానూరి, తలకు ఈ పేస్టును బాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. శిరోజాల సమృద్ధిగా పెరుగుతాయి.



Click it and Unblock the Notifications