Latest Updates
-
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా..
జుట్టుకు హెన్న పెట్టుకోడానికి సులభ మార్గాలు
జుట్టుకు హెన్నా అప్లై చేయడం పెద్ద పని కాదు. కానీ, మీ అందమైన జుట్టుకు హెన్నా అప్లై చేయడానికి మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీ జుట్టుకు హెన్నా అప్లై చేసినప్పుడు, మొదట మీజుట్టుకు ఆయిల్ లేకుండా చూసుకోవాలి.
ఆయిల్ ఉన్న జుట్టుకు హెన్న అప్లై చేస్తే మీరు అనుకున్నంత మంచి ఫలితాలను ఇవ్వలేదు. మీ జుట్టు హెన్నా అప్లై చేయడం వల్ల మీ జుట్టు మంచిగా పెరుగుతుంది, మీ జుట్టు యొక్క వాల్యుమ్ పెరుగుతుంది. ఇది జుట్టుకు ప్రయోజనకారి మరియు జుట్టుకు ఆరోగ్యకరమైనది.
మీది పొడవాటి జుట్టు అయితే, హెన్నాను మీజుట్టుకు అప్లై చేయడం కొంచెం కష్టమైన పనే, అందువల్ల మీరు కొన్ని చిట్కాలను క్రమంగా అనుసరించాల్సి ఉంటుంది.
కలర్ హెయిర్: హెన్నాను 6 నెలలకొకసారి అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ మరియు హెయిర్ కలర్ ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతే కాదు, ఎటువంటి జుట్టు సమస్యలున్నా నివారించబడుతుంది. అయితే, ఇది మీకు ఫర్ఫెక్ట్ గా ఉంటుందా లేదా అన్నదానికి మీరు ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.హెన్నా అప్లై చేయడానికి అనుసరించాల్సిన పద్దతులు స్టెప్ బై స్టెప్

మీ ఫోర్ హెడ్ (నుదటి)మీద కొబ్బరి నూనెను అప్లై చేయాలి
తలకు హెన్న పెట్టుకోవడానికి ముందు, కొద్దిగా కొబ్బరి నూనెను మీ ఫోర్ హెడ్ మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హెన్నా మీ ముఖం మీద పడకుండా ఉంటుంది.

తలను దువ్వుకోవాలి
హెన్నా అప్లై చేయడానికి ముందు, బ్రష్ తో తలను ముందుగా దువ్వుకొని, చిక్కుముడులను తొలగించుకోవాలి. దాంతో మీరు జుట్టుకు హెన్నాను మరింత సులభంగా అప్లై చేయవచ్చు. జుట్టును రెండుగా భాగాలుగా అప్లై చేయాలి.

హెన్నాను బాగా మిక్స్ చేయాలి
హెన్నాను అవసరం అయిన పదార్థాలన్నీ(టీ డికాషిన్ మరియ పౌడర్) వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా మీరు కాఫీ డికాషన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు.

మొదట నెత్తి మీద నుండి మొదలు పెట్టాలి
హెన్నా పెట్టుకోవడానికి, తల మీద నుండి మొదల పెట్టి, తర్వాత జుట్టుచివర్లు వరకూ అప్లై చేయాల్సి ఉంటుంది.

హెన్నా అప్లై చేయడం
హెన్నా అప్లై చేసుకోవడానికి రబ్బర్ గ్లౌజ్ లను ఉపయోగించాలి. కొద్దిగా చేతిలోకి తీసుకొని, క్రమంగా అప్లై చేయాలి. వెనుకవైను జుట్టును విడవకుండా మొత్తం అప్లై చేయాలి.

చిన్న ముడిగా వేసుకోవాలి
మొదట నెత్తి మీద హెన్నా అప్లై చేయడం మొదలు పెట్టిన తర్వాత చిన్నగా బన్ లాగా వేసుకోవాలి . తర్వాత వెంట్రుకలకు పట్టించి తర్వాత క్రింది వెంట్రుకలు కూడా పైకి తీసి చక్కగా ముడివేయాలి.

సైడ్స్ నుండి మొదలు పెట్టాలి
తలమీద అప్లై చేసిన తర్వాత సైడ్స్ లో పెట్టడం మొదలు పెట్టాలి. పక్కల్లో కొద్దిగా తీసుకుంటా, అప్లై చేస్తూ పైకి ముడేస్తూ పోవాలి.

అదే బన్ కు ముడి వేయాలి
సైడ్స్ లో అప్లై చేసిన తర్వాత అదే బన్ కు చుట్టాలి. హెయిర్ ను నిధానంగా తీసుకుంటే, ముందుగా ముడి వేసిన బన్ కుచుట్టాలి.

ఇప్పుడు తిరిగి తల మీద అప్లై చేయాలి
ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత, తిరిగి నుదిటి వద్ద నుండి తిరిగి మళ్ళీ ఒకసారి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకలేయర్ గా వేసి తిరిగి మరో లేయర్ ను వేయాలి

సైడ్ లో ఏవైనా మిగిలిపోయన్నాయో చూసుకోవాలి
ప్రక్కల్లో ఏవైనా వెంట్రుకలు మిగిలిపోయింటే, వాటిని కూడా కవర్ చేస్తూ, హెన్నా అప్లై చేసి పైకి తీసి ముడి వేయాలి.

ముఖ్యమైన ప్రదేశాలను వదలకూడదు
ఇది చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్నప్రదేశంలో ఎక్కువగా అప్లై చేయాలి. మెడవద్ద మరియు బార్డర్ లైన్ కూడా వదలిపెట్టకుండా అప్లైచేయాలి.

మీ జుట్టు మీద హెన్నాను స్మూత్ చేయాలి
మీరు మీ జుట్టుకు పూర్తిగా హెన్నా అప్లై చేసిన తర్వాత, తల మొత్తం హెన్నాను స్మూత్ గా చేత్తో, నునుపుగా చేయాలి.

ప్లాస్టిక్ బ్యాగ్ ను మీ జుట్టు చుట్టూ చుట్టాలి
ప్లాస్టిక్ కవర్ ను మీ తలకు చుట్టడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల, తలకు చల్లదనాన్ని కలిగి స్తుంది. మీరును వాతావరణంను బట్టి మీ జుట్టుకు కవర్ చేసుకోవాలి.

ఎంత సమయం హెన్నా తలకు ఉండాలి...
హెన్నా మీ జుట్టు మీద కనీసం 2 గంటల పాటు ఉండాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసేసుకోవాలి.



Click it and Unblock the Notifications