హెయిర్ స్పా వల్ల జుట్టుకు కలిగే టాప్ 10 ప్రయోజనాలు

By Super

హెయిర్ స్పా : జుట్టుకు సరైన కండీషనర్ ను అప్లై చేయడమే...ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ . జుట్టు పెరుగుదలకోసం ఒక హెయిర్ థెరఫీ వంటిది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది చుండ్రు, హెయిర్ లాస్, రఫ్ అండ్ డల్ హెయిర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. హెయిర్ స్పా వల్ల ఇలాంటి సమస్యలను నివారించుకోవచ్చు.

READ MORE: ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడానికి : సులభ చిట్కాలు

హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జుట్టుకు మరియు తలతో జుట్టు మొదళ్లకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. తలలో రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది మరియు మనస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి పరుస్తుంది. అంతే కాదు హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.....

READ MORE: జుట్టు బాగా పెరగాలంటే హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ బెస్ట్...!

టాప్ 10 హెయిర్ స్పా బెనిఫిట్స్:

కండీషనింగ్ :

కండీషనింగ్ :

హెయిర్ స్పా వల్ల జుట్టుకు డీప్ గా కండీషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. జుట్టు మొదళ్ల నుండి రూట్స్ కు తగిన పోషణను అందించి, హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది . తలలో నూనె గ్రంథులను కంట్రోల్ చేస్తుంది. తలలో రీహైడ్రేషన్ కలిగించి తలలో డ్రైనెస్ ను పోగొడుతుంది. వాతావరణ కాలుష్యం మరియు ఇతర విషపదార్థాలు వాయువల వల్ల తలలో చేరే మురికిని హెయిర్ స్పా ట్రీట్మెంట్ ద్వారా శుభ్రం చేసుకోవచ్చు . హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల డల్ గా మరియు డ్యామేజ్ అయిన హెయిర్ ను తిరిగి ప్రకాశంతంగా, ఆరోగ్యకరమైన షైనీ హెయిర్ ను పొందేలా చేస్తుంది . జుట్టు స్మూత్ గా హెల్తీగా పెరుగుటకు సహాయపడుతుంది.

చుండ్రు నివారిస్తుంది :

చుండ్రు నివారిస్తుంది :

చాల మంది జుట్టు రాలే సమస్య మరియు చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు, ఈ సమస్యలను నివారించుకోవడానికి ఉత్తమ ఉపాయం హెయిర్ స్పా ట్రీట్మెంట్. ఈ సమస్యలు ముఖ్యంగా స్ట్రెస్, క్లైమాటిక్ కండీషన్స్, హార్మోన్లలో మార్పులు సరిగా శుభ్రత పాటించకపోవడం వల్ల మాత్రమే వస్తుంది . హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల విశ్రాంతి పొందడంతో పాటు, స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవచ్చు . జుట్టు తిరిగి పెరుగుటను ప్రోత్సహిస్తుంది..

ఒత్తైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు:

ఒత్తైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు:

హెయిర్ స్పా ట్రీట్మెంట్ హెయిర్ ఫాలిసెల్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది, దాంతో జుట్టు ఒత్తుగా మంచి షైనింగ్ తో తిరిగి పెరగడం ప్రారంబిస్తుంది . జుట్టుకు హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది . హెయిర్ వాల్యూమ్ ను పెంచుతుంది . జుట్టు చూడటానికి ఒత్తుగా మరియు హెల్తీగా కనబడుతుంది.

 స్లాప్ ఏజింగ్ నివారిస్తుంది:

స్లాప్ ఏజింగ్ నివారిస్తుంది:

స్లాప్ ఏజింగ్ జుట్టు రాలడం నివారిస్తుంది . హెయిర్ స్పా ట్రీట్మెంట్ స్లాప్ ఏజింగ్ నివారిస్తుంది, దాంతో తలలోని సెబమ్ సెక్రిషన్ బ్యాలెన్స్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది . హెయిర్ స్పా ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఎందుకంటే హెయిర్ స్పా వల్ల తలలో మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది . దాని వల్ల తలలో దురద మరియు వయస్సైపోవడం వల్ల జుట్టు రాలడం సమస్యలను నివారించబడుతుంది.

మెంటల్ స్ట్రెస్ ను ఉపశమనం పొందవచ్చు:

మెంటల్ స్ట్రెస్ ను ఉపశమనం పొందవచ్చు:

ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధాన సమస్య మెంటల్ స్ట్రెస్. ఈ సమస్య అనారోగ్యకరమైన జీవనశైలి, వర్క్ ప్రెజర్. దీనికి ఒక ఉత్తమమైన మార్గం హెయిర్ స్పా ట్రీట్మెంట్. స్పా ట్రీట్మెంట్ లో బాడీ మసాజ్ తోపాటు తల కూడా మాసాజ్ చేయడం వల్ల మీకు అవసరం అయినంత విశ్రాంతిని అందించి, రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. దాంతో జుట్టు వేగంగా పెరుగడానికి సహాయపడుతుంది.

డల్ మరియు చిక్కుబడ్డ హెయిర్ ను నివారిస్తుంది :

డల్ మరియు చిక్కుబడ్డ హెయిర్ ను నివారిస్తుంది :

హెయిర్ స్పా ట్రీట్మెంట్లో ఆయిల్ మాసాజ్ కూడా ఒకటి . ఆయిల్ మసాజ్ వల్ల తలకు డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఈ నూనె కేశాలకు పోషణను అందిస్తుంది దాంతో నిర్జీవమైన జుట్టు మరియు చిక్కును విడిపించి హెల్లీగా అండ్ స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ ను మనకు అందిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టును మెయింటైన్ చేయాలి

ఆరోగ్యకరమైన జుట్టును మెయింటైన్ చేయాలి

ఆరోగ్యకరమైన తల మరియు జుట్టు వల్ల జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును ఆరోగ్యంగా మరియు శుభ్రంగా నిర్వహిస్తుండాలి. ఎలాంటి దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు హెయిర్ వాష్ చేసుకోవడం, హెయిర్ స్పా ట్రీట్మెంట్ ను రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల తల శుభ్రపడుతుంది. ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది.

సాధారణ ఆయిల్ సెగ్రిగేషన్:

సాధారణ ఆయిల్ సెగ్రిగేషన్:

ఒక మంచి మరియు ఆరోగ్యకరమైన హెయిర్ ను మెయింటైన్ చేయడానికి, తలలో ఆయిల్ స్రావాలను నార్మల్ గా ఉండాలి. తలలో ఆయిల్ తక్కువగా ఉన్నట్లైతే జుట్టు డల్ గా మరియు డ్రైగా కనబడుతుంది. తలలో ఎక్కువగా ఆయిల్ ఉన్నప్పుడు అది చాలా జిడ్డుగా మారుతుంది . కాబట్టి ఆయిల్ పెట్టుకోవడం కూడా బ్యాన్స్డ్ గా ఉండాలి . అప్పుడే జుట్టు హెల్తీగా కనబడుతుంది.

మలినాలను తొలగిస్తుంది:

మలినాలను తొలగిస్తుంది:

కాలుష్యం వల్ల జుట్టు చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది. తలలోని చర్మ రంద్రాల్లో మలినాలు చేయడం వల్ల జుట్టు రాలడానికి ప్రధాణ కారణం అవుతుంది . రెగ్యులర్ హెయిర్ వాలస్ మరియు స్పా ట్రీట్మెంట్ వల్ల జుట్టు క్లీన్ గా మరియు హెల్తీగా మారుతుంది . హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. మరియు ఇది డల్ అండ్ డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేస్తుంది.

జుట్టు బాగా పెరుగుతుంది:

జుట్టు బాగా పెరుగుతుంది:

హెయిర్ స్పా ట్రీట్మెంట్ వల్ల తలలో రీహైడ్రేషన్ జరుగుతుంది . ఇది తలలో నూనె స్రావాలను నార్మల్ చేస్తుంది. దాంతో జుట్టు సిల్కీగా మరియు స్మూత్ గా మార్చుతుంది. మరి హెయిర్ స్పా గురించి తెలుసుకొన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం, హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేయించుకొని, మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి....

Desktop Bottom Promotion